Engine Oil Tips: బైక్‌లో ఇంజిన్ ఆయిల్ టైంకి మార్చకపోతే ఎంత డేంజరో తెలుసా?
Vehicle Engine Oil Tips: స్కూటర్ ఇంజిన్‌లో ఆయిల్‌ని సరైన టైమ్‌కి మార్చకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా? ఇంజిన్ ఆయిల్‌ని ఎప్పుడు మార్చాలి? మార్చకపోతే ఏమవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు స్కూటరును క్రమం తప్పకుండా సర్వీసు చేయిస్తున్నారా? కొత్త బైక్ కొన్నప్పుడు చాలామంది చేసే తప్పేంటంటే.. ఫ్రీ సర్వీసులు అయిపోయిన తర్వాత బైక్ సర్వీసు చేయడం మానేస్తారు. దీంతో సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. ఆ సమస్యలు ఎంత దూరం వెళతాయంటే మీ బైక్ మొత్తం పాడైపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే సరైన సమయానికి బైక్ ఇంజిన్ ఆయిల్ మార్చాలి.
ప్రతి బైక్ కి ఇంజిన్ ఆయిల్ హార్ట్ లాంటిది. అలాంటి ఇంజిన్ ఆయిల్ ని సరైన సమయానికి మార్చకపోతే బైక్ లోని ఇతర పార్ట్స్ కూడా పాడైపోతాయి. ఇంజిన్‌లో ఆయిల్ పని లూబ్రికేషన్‌ని మెయింటైన్ చేయడం. అందుకే ఇంజిన్ ఆయిల్ లేకపోయినా, తగ్గినా లూబ్రికేషన్ కూడా తగ్గుతుంది. దీనివల్ల ఇంజిన్ లో పార్ట్స్ ఒకదానితో ఒకటి కాంటాక్ట్ అయిపోతాయి.
ఎలాంటి ఇంజిన్ ఆయిల్ వాడాలి
మీ బైక్ కంపెనీ సిఫార్సు చేసిన ఆయిల్ బ్రాండ్‌ను వాడితే ఇంజిన్ లైఫ్ టైమ్ ఎక్కువ వస్తుంది. సింథటిక్ లేదా సెమీ-సింథటిక్ ఆయిల్ వాడితే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది.
బైక్ ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే వచ్చే ప్రాబ్లమ్స్
స్కూటర్‌ని సర్వీస్ చేసేటప్పుడు, ఇంజిన్ ఆయిల్ నుంచి ఎయిర్ ఫిల్టర్, పాడైన పార్ట్స్ వరకు అన్నీ మార్చాలి. వీటిలో ముఖ్యంగా ఇంజిన్ ఆయిల్ మార్చడం చాలా ఇంపార్టెంట్. ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే ఇంజిన్ ఓవర్‌హీటింగ్ అవుతుంది. బైక్ స్మూత్‌గా రన్ అవ్వదు. పవర్ తక్కువగా ఫీలవుతుంది. మైలేజ్ దారుణంగా పడిపోతుంది. ఇంజిన్ లో మురికి కార్బన్ పేరుకుని, ఇంధన దహనం సరిగ్గా జరగదు. చాలా కాలం నుంచి ఆయిల్ మార్చకపోతే ఇంజిన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇది కూడా చదవండి వేసవిలో బైక్ టైర్లు పేలిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
బైక్ ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మార్చాలి?
కొత్త బైక్ అయితే 500-750 కి.మీ. తర్వాత మొదటి ఆయిల్ చేంజ్ చేయాలి.
ఆ తర్వాత ప్రతి 2000-2500 కి.మీ.కి ఒకసారి మార్చాలి.
ఆయిల్ తగినప్పుడు లేదా బ్లాక్, ముదురు రంగులోకి మారితే ఆయిల్ మార్చాలి.
ప్రతి బైక్ మోడల్‌కు ఆయిల్ మార్చే స్పెసిఫికేషన్ వేరుగా ఉంటుంది. మాన్యువల్లో సూచించిన గ్యాప్‌కి మార్చడం ఉత్తమం.
రోజూ ఎక్కువ డ్రైవ్ చేస్తే లేదా దుమ్ము, మట్టి ఎక్కువగా ఉన్న రోడ్ల మీద బైక్ నడిపితే ఆయిల్ త్వరగా చెడిపోతుంది. అప్పుడు ఇంజిన్ ఆయిల్ కలర్ మారినప్పుడు మార్చేయాలి.