Union Bank అదిరిపోయే ఆఫర్.. కళ్లు చెదిరే వడ్డీ
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అదిరిపోయే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను అందిస్తోంది. వివిధ కాల పరిమితుల FDలపై 7.4% నుంచి 8.15% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రేట్లు కూడా ఉన్నాయి.
Union Bank’s Fixed Deposit Rates
యూనియన్ బ్యాంకు తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇతర బ్యాంకులకు దీటుగా వడ్డీ అందిస్తోంది. Union Bank 333-రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.4 నుంచి 8.15 శాతం వరకు వడ్డీ రేట్ ఆఫర్ చేస్తోంది. FD కాల పరిమితి 399 రోజులు ఉన్నప్పుడు వడ్డీ రేటు 8 శాతానికి పెరుగుతుంది. ఈ వడ్డీ రేట్లు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
Union Bank’s Fixed Deposit Rates
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 333 రోజుల కాల పరిమితి కలిగిన డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7.4 శాతం ప్రత్యేక వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు టర్మ్ డిపాజిట్‌పై అదనపు 50 బేసిస్ పాయింట్లు కలిపి 7.9 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. అయితే, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 75 బేసిస్ పాయింట్లు ఇస్తోంది. ఈ లెక్కన 333 రోజుల కాల పరిమితి ఉన్న FDపై 8.15 శాతం పొందవచ్చు.
Union Bank’s Fixed Deposit Rates
అలాగే, 399 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ సాధారణ పౌరులకు సంవత్సరానికి 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లు సంవత్సరానికి 8.00 శాతం వడ్డీ పొందవచ్చు.
అలాగే, FD పదవీకాలం 181 రోజుల నుంచి 332 రోజుల మధ్య ఉంటే వడ్డీ రేటు 6.35 శాతం వర్తిస్తుంది. 121-180 కాల పరిమిత గల FDపై యూనియన్ బ్యాంక్ 5 శాతం వడ్డీని అందిస్తుంది.
అటు, 3 సంవత్సరాల కాలవ్యవధిలో ఉన్న FDలకు సాధారణ పౌరులకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.20 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.45 శాతం వడ్డీని యూనియన్ బ్యాంకు అందిస్తుంది.
Union Bank’s Fixed Deposit Rates
ఇక, 998 రోజుల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ కాల పరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు సాధారణ పౌరులైతే 6.60 శాతం వడ్డీ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు 7.10 శాతం, , సూపర్ సీనియర్ సిటిజన్లు 7.35 శాతం పొందేందుకు అర్హులు.
3-10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో FDలపై యూనియన్ బ్యాంకు 6.5 శాతం అందిస్తుంది. ఈ రేట్లు 2024 ఆగస్ట్ 2 నుంచి అమలులోకి వచ్చాయి.
Fixed Deposit Rates
అయితే, ప్రత్యేక కాల పరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ (FD)లపై అధిక వడ్డీని అందించే అనేక ఇతర బ్యాంకులు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 399 రోజుల FDపై 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. 400 రోజులు కాల పరిమితి ఉన్న FDలకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.25 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా 55 నెలల కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.40 శాతం వడ్డీ రేటు అందిస్తున్నాయి.