ఇండియాలో టాప్ 5 హైటెక్, అడ్వాన్స్ స్కూటర్లు ఇవే..
మీరు బెస్ట్ అండ్ అడ్వాన్స్ స్కూటర్లు కొనే ఆలోచనలో ఉంటే టాప్ 5 స్కూటర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వాటి ఫీచర్స్, ధరలు, మైలేజ్, బ్యాటరీ కెపాసిటీ ఇలా అనేక వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని పరిశీలించి మీకు సరిపోయే స్కూటర్ ని ఎంచుకోండి.
BMW C 400 GT
BMW మోటోరాడ్ కొత్త మ్యాక్సీ స్కూటర్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇండియాలో ఈ కంపెనీ C 400 GT మోడల్ ని విడుదల చేసింది. ఇది 7,500 rpm వద్ద గరిష్టంగా 33.5 bhp శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా 5,750 rpm వద్ద 35 Nm గరిష్ట టార్క్‌ను అందించేలా ఈ స్కూటర్ తయారు చేశారు. 350 cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో ఉన్న ఈ స్కూటర్ నడిపే వారికి చాలా కంఫర్ట్ ని ఇస్తుంది. ఇందులోని మోటార్ CVT గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు. అందువల్ల స్పీడ్ కంట్రోలింగ్ ఈజీగా చేయొచ్చు. ఈ స్కూటర్ 100 kmph యాక్సిలరేషన్ సమయాన్ని 9.5 సెకన్లలో అందుకుంటుంది. దీని మాక్సిమం స్పీడ్ 139 kmph.
TVS iQube
TVS ఇండియాలో iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ను 5 మోడల్స్ లో తీసుకొచ్చింది. బేస్ మోడల్ రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. అవి 2.2 kWh, 3.4 kWh. వీటికి మోటార్ మాత్రం 4 kW ఉపయోగించారు. 2.2 kWh బ్యాటరీ ప్యాక్ తో ఉన్న ఈ స్కూటర్ 75 kmph వేగంతో పరుగులు పెట్టగలరు. ఒకసారి ఛార్జ్ చేస్తే 75 km ఆగకుండా నడుస్తుంది. అదే సమయంలో 3.4 kWh ట్రిమ్ మోడల్ 78 kmph గరిష్ఠ వేగాన్ని కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 km వెళుతుంది. ఈ స్కూటర్ ఛార్జ్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర ఎక్స్ ఫోరూమ్ లో రూ.1.55 లక్షలు.
Ather 450 అపెక్స్
బెంగుళూరుకు చెందిన EV మేకర్ ఏథర్ ఎనర్జీ విడుదల చేసిన కొత్త 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. Ather 450 అపెక్స్ సావ్ డిజైన్‌ను కలిగి ఉంది. పాయింటెడ్ ఫ్రంట్ ఎండ్, ఏరోడైనమిక్ సైడ్ ప్యానెల్‌లు స్కూటర్ లుక్ ని చాలా స్టైలిష్ చేశాయి. Ather 450 అపెక్స్ ధర రూ. 1,89,000 (ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ లో పూర్తిగా LED లైట్లు అమర్చారు. ఇందులో ఐదు రైడ్ మోడ్ లు ఉంటాయి. అవి స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్, వార్ప్ ప్లస్. అంతేకాకుండా ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ TFTతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యాష్‌బోర్డ్ ఆటో-బ్రైట్‌నెస్, పార్క్ అసిస్ట్, హిల్ హోల్డ్, ఆటో ఇండికేటర్ కట్ -ఆఫ్, కోస్టింగ్ రీజెనరేటివ్ బ్రేకింగ్, మ్యాజిక్ ట్విస్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొత్త ఏథర్ స్కూటర్‌లో 3.7kWh బ్యాటరీతో 7kW మోటార్ ఉంది. 100 kmph గరిష్ట వేగం కాగా, ఒకసారి ఛార్జ్ చేస్తే 157 km వరకు పరుగెడుతుంది.
Ola S1 pro
OLA S1 ప్రో ఒక వేరియంట్, 5 రంగులలో అందుబాటులో ఉన్న సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్. OLA S1 ప్రో దాని మోటార్ నుండి 5.5 W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. S1 ప్రో స్టాండర్డ్ ప్రారంభ ధర రూ. 1,40,872(ఎక్స్-షోరూమ్).
Ola S1 Pro ఎలక్ట్రిక్ మోటారు 11 kW అధిక గరిష్ట శక్తిని అందిస్తుంది. ఇది గరిష్టంగా 120 kmph వేగంతో పరుగెడుతుంది. 2.6 సెకన్లలో 40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది ఎకో మోడ్‌లో 195 కి.మీ.ల వరకు ఆగకుండా రన్ చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇది ఓలా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో కూడిన 7-అంగుళాల TFT డిస్‌ప్లే ఇందులో ఉన్నాయి. ఇతర ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, LED లైట్లు ఉన్నాయి. Ola S1 ప్రో ఐదు రంగులలో లభిస్తుంది. అవి జెట్ బ్లాక్, మాట్ వైట్, స్టెల్లార్ బ్లూ, మిడ్‌నైట్ బ్లూ, అమెథిస్ట్.
Ather 450 X
ఏథర్ 450X నాలుగు వేరియంట్‌లు, 6 రంగులలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్. Ather 450X దాని మోటార్ నుండి 3.3 W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
Ather 450Xలో రెండు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. 2.9 kWh బ్యాటరీ ప్యాక్ మీకు 90 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. 3.7 kWh బ్యాటరీ అయితే 110 కి.మీ. ఆగకుండా పరుగెడుతుంది. మోటార్ అవుట్‌పుట్ టాప్ స్పీడ్ రెండింటికీ ఒకే విధంగా ఉంటాయి. 3.7 kWh బ్యాటరీ కోసం ఛార్జింగ్ సమయం ఐదు గంటల 45 నిమిషాలు పడుతుంది. 2.9 kWh యూనిట్ పూర్తి ఛార్జ్ కోసం ఎనిమిది గంటల 36 నిమిషాలు పడుతుంది.
ఫీచర్ల విషయానికొస్తే LED లైట్స్, 16 GB నిల్వ సామర్థ్యం, ఏడు అంగుళాల TFT టచ్‌స్క్రీన్, CBSలను కలిగి ఉంటాయి. ఇందులో Google మ్యాప్స్ నావిగేషన్ చేయడానికి, డాక్యుమెంట్ స్టోరేజ్, దొంగతనం నోటిఫికేషన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్ అనే ఐదు రకాల రైడ్ మోడ్‌లను మీరు ఇందులో యాక్సెస్ చేయొచ్చు. ఈ స్కూటర్ ధర రూ. 16,999 నుంచి రూ.23,078 మధ్య ఉంది.