MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: ఉన్న ఊరిలోనే ఈ చెట్లను పెంచి నెలకు లక్షల్లో సంపాదిస్తున్న రైతు..పూర్తి వివరాలు తెలుసుకోండి..

Business Ideas: ఉన్న ఊరిలోనే ఈ చెట్లను పెంచి నెలకు లక్షల్లో సంపాదిస్తున్న రైతు..పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఉన్న ఊరిలో నెలకు లక్షల్లో సంపాదిస్తే  అంతకన్నా స్వర్గం మరొకటి ఉండదేమో, కానీ అదంతా ఒక కల అది అంతా అనుకుంటారు. ఆ కలను కూడా నిజం చేసుకున్న కొందరు రైతుల విజయగాథలు మనకు స్ఫూర్తిని ఇస్తాయి. అలాంటి ఓ రైతు గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Krishna Adhitya
Published : Oct 17 2022, 11:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
dates

dates

ఖర్జూరం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది గల్ఫ్ దేశాలు.  ఈ ఎడారి దేశాల్లో ఖర్జూరం పంట విపరీతంగా పండుతుంది. ఇక్కడి నుంచి  ప్రపంచమంతా  ఖర్జూర పండు ఎగుమతి అవుతుంది.  ఖర్జూరం ఎడారిలో తప్ప మరి ఎక్కడా పండదనే  అపోహ ఉంది.  మన దేశంలో సైతం కొందరు రైతులు విజయవంతం ఖర్జూరం సాగు చేస్తోంది లక్షలు సంపాదిస్తున్నారు కర్ణాటక  చెందిన ఓ రైతు ఖర్జూరం సాగు చేస్తూ తన కల సాకారం చేసుకున్నాడు.
 

25

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూరుకు చెందిన  దివాకర్ చెన్నప్ప అనే రైతు ఇందుకు నిదర్శనంగా నిలిచాడు. ధర్మపురికి చెందిన రైతు నిజాముద్దీన్ బెంగుళూరులోని జికెవికె కృషి మేళాలో దక్షిణ భారతదేశంలో ఖర్జూరం పెరగడానికి గల అవకాశాల గురించి సమాచారాన్నివివరించారు.

35

 ఈ మేళాలో పాల్గొన్న దివాకర్ చెన్నప్ప అనే 44 ఏళ్ల రైతు తన ప్రసంగంతో స్ఫూర్తి పొందారు. తాను కూడా కర్జూరం పండించి ఆదర్శంగా నిలవాలని అనుకున్నాడు. ముందుగా తమిళనాడులోని నిజాముద్దీన్ పొలాన్ని సందర్శించిన చెన్నప్ప అక్కడ ఖర్జూర పంట విజయవంతమవడం చూసి ఆశ్చర్యపోయాడు.

45

అప్పుడు 150 టిష్యూ కల్చర్ చేసిన ఖర్జూర విత్తనాలను తెచ్చి గౌరీబిదనూరులోని ముదగకుంటెలో దివాకర్ కు చెందిన రెండెకరాల భూమిలో నాటాడు. ఇక్కడి వాతావరణం నేల పరిస్థితులు ఖర్జూర పంటలను పండించే విధంగానే ఉండటంతో, ఫలితం లభించిందని దివాకర్ చెన్నప్ప చెప్పారు. మొదటి పంటను పొందడానికి వరుసగా నాలుగు సంవత్సరాలు పట్టింది. ప్రారంభ పంట దాదాపు 800-1,000 కిలోల ఖర్జూరం లభించింది. కానీ ఇప్పుడు నేను సంవత్సరానికి 5 టన్నుల ఖర్జూరాన్ని పండిస్తున్నట్లు దివాకర్ తెలిపారు. 

55
dates

dates

దివాకర ఖర్జూరాన్ని మార్కెట్లలో లేదా దుకాణాల్లో విక్రయించడు. బెంగళూరులోని కస్టమర్ల ఇళ్లకు డేట్స్ డెలివరీ చేస్తాడు. దాదాపు 300 నుంచి 400 మందికి ఖర్జూరాలను దివాకర్ డెలివరీ  చేస్తుంటారు. ఖర్జూరాన్ని కిలో రూ.310కి విక్రయిస్తుంటాడు చెన్నప్ప.  గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు నేరుగా డెలివరీ చేయడం ద్వారా మధ్య దళారీల కు కమిషన్ ఇవ్వాల్సిన పనిలేదు.  నేరుగా కస్టమర్ కే  తక్కువ ధరకు విక్రయించడం వల్ల,  చాలామంది ఇది రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయారు. 

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Price: లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ కేవ‌లం 2 రూపాయ‌లు మాత్ర‌మే..ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Stock Market: 8 రోజుల్లో రూ. 6 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ప్ర‌మాదంలో ఉన్నాయా.?
Recommended image3
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రైళ్లలో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved