Businessmen: వీళ్లు డిగ్రీ కూడా చదవలేదు.. కానీ వందలకోట్లు సంపాదించే వ్యాపారవేత్తలయ్యారు
జీవితంలో కేవలం చదువుకున్న వారే విజయవంతమవుతారని చెప్పలేం.. వినూత్నంగా, కాలానికి తగ్గట్టు ఆలోచించేవారు కూడా సక్సెస్ అవుతారు. కనీసం కళాశాల విద్య కూడా పూర్తి చేయకుండా బిలియనీర్లు (Billionaires) అయిన వ్యాపారవేత్తలు ఇక్కడ ఉన్నారు.

బిలియనీర్ల జాబితా
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ప్రపంచంలోనే బిలియనీర్ల జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో ఉన్న వారిలో కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయకుండా వందల కోట్లకు అధిపతులు అయిపోయారు. వారి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వేల మందికి ఉద్యోగాలను అందిస్తున్నాయి. అలా గ్రాడ్యుయేషన్ పూర్తి కాకుండానే బిలియనీర్లుగా మారిన వారి గురించి ఇక్కడ ఇచ్చాము. ఆ వ్యాపారవేత్తల గురించి ఇక్కడ ఇచ్చాము తెలుసుకోండి.
మార్క్ జుకర్ బర్గ్
మార్క్ జుగర్ బర్గ్ కనీసం డిగ్రీని కూడా పూర్తి చేయలేదు. అయినా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాక మధ్యలోనే చదువును వదిలేశాడు. ఆ తర్వాత ఫేస్ బుక్ స్థాపించి 265 బిలియన్ల డాలర్లకు అధిపతి అయ్యాడు.
బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఈయన కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరి చదువును పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశాడు. ఇతని ఆస్తి విలువ 121 బిలియన్ డాలర్లుగా అంచనా. మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వస్తేనే జీవితం సెటిల్ అయిపోయేటట్టు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యువత భావిస్తారు.
లారీ ఎలిసన్
ఒరాకిల్ అధినేత లారీ ఎలిసన్ ఇతడు ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యంత ధనవంతుడిగా పేరుపొందాడు. చికాగో, ఇల్లినాయిస్ యూనివర్సిటీలో చేరి చదువును పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశాడు. ఇతని ఆస్తి 393 బిలియన్ డాలర్లుగా తేల్చారు.
ముఖేష్ అంబానీ
మన దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ. ఇతనికి కూడా డిగ్రీ లేదు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ కోసం చేరాడు. కానీ చదవకుండా మధ్యలోనే వదిలేసి ఇండియా వచ్చారు. ఇప్పుడు రిలయన్స్ సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు.
స్టీవ్ జాబ్స్
ఆపిల్ ఉత్పత్తులకు ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. దాని సృష్టికర్త స్టీవ్ జాబ్స్. ఇతడు మరణించాడు. అయితే స్టీవ్ జాబ్స్ కూడా చదువునే పూర్తి చేయలేదు. కాలేజీ చదువును మధ్యలోనే వదిలేసి ఈ ఆపిల్ ఉత్పత్తులు సృష్టించడంలో బిజీ అయిపోయాడు.