దీపావళి తర్వాత వీటి రేట్లు అమాంతం పెరిగిపోతాయి, ముందే కొనేసుకుంటే బెటర్
దీపావళి తర్వాత ధరల్లో ఎన్నో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ స్పీచ్ లోనే తెలియజేశారు. కాబట్టి ఏ వస్తువులు దీపావళి తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందో తెలుసుకోండి.

దీపావళికి జీఎస్టీ మేళా
దీపావళికి జీఎస్టీ పండగ రాబోతోందని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏమి తగ్గుతాయో అని సాధారణ జనం కంగారుపడుతున్నారు. జీఎస్టీలో భారీ సంస్కరణలను ప్రవేశపెడతామని ఆయన ఎర్రకోటపై జెండా ఎగిరేసాక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాదు ప్రజలందరిలో కొత్తల ఆశలు రేకెత్తించేలా జీఎస్టీ లో మార్పులు ఉంటాయని కూడా చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి జిఎస్టిలో దీపావళి నుంచి భారీ మార్పులు వస్తాయి. కొన్ని రకాల వస్తువులు ధర పెరిగితే.. మరికొన్ని ధర తగ్గుతాయి. ఏవి తగ్గుతాయో ఏమి పెరుగుతాయో తెలుసుకోండి.
జీఎస్టీ ఇకపై రెండే శ్లాబులు
ప్రస్తుతం జీఎస్టీని నాలుగు శ్లాబులుగా విడదీసి అమలు చేస్తున్నారు. ఐదు శాతం, పన్నెండు శాతం, 18 శాతం, 28 శాతంతో జిఎస్టి స్లాబులు ఉన్నాయి. దీపావళికి కేవలం ఐదు శాతం, 18 శాతం స్లాబులుగా సర్దుబాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంచుకుంది. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రకాల వస్తువులపై ప్రత్యేక పన్ను రేట్లు దీపావళి తర్వాత ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. జిఎస్టిలో చేసే మార్పుల వల్ల పన్ను రేట్లు చాలా వరకు తగ్గడం, పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి. అయితే వేటి ధర దీపావళి తర్వాత పెరుగుతాయో ముందే తెలుసుకుంటే మంచిది. మీరు ఈలోపే వాటిని కొనుగోలు చేయవచ్చు.
ఇవన్నీ ఇక ఖరీదైనవే
రెడీమేడ్ దుస్తుల ధరలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాచీలు, బూట్లు కూడా మీరు కొనాలనుకుంటే దీపావళికి ముందే కొనేసుకోండి. లేకుంటే వాటి ధరలు కూడా కొండెక్కిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యానికి హాని చేసే కూల్ డ్రింకులను కూడా ఎక్కువ జీఎస్టీ స్లాబుల్లోనే వేయబోతున్నారు. ఇక ఖరీదైన కార్లు, వజ్రాలు, రత్నాలు వంటివి కూడా విపరీతమైన జీఎస్టీ శ్లాబులో పడే అవకాశం ఉంది. ఇక కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు కూడా ఖరీదుగా మారుతాయి. బిజినెస్ క్లాస్ విమానం టికెట్లు కూడా పెరిగిపోతాయి. లాడ్జిలు, హోటల్ గదుల ధరలు కూడా పెరిగిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పెరిగే వస్తువుల్లో దుస్తులు, మొబైల్ ఫోన్లు వంటివి మధ్యతరగతి జనానికి కావాల్సినవి. వీటి ధర పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ముందుగానే బుక్ చేసుకుంటే ఎంతో కొంత డబ్బును ఆదా చేసుకున్న వారు అవుతారు.
ఇక వీటి ధరలు తగ్గుతాయి
పాలు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్ళు, హెయిర్ ఆయిల్, గొడుగులు, సబ్బులు, కుట్టు మిషన్లు, వాటర్ ఫిల్టర్లు, స్టీలు పాత్రలు, కుక్కర్లు, గీజర్లు, వాక్యూమ్ క్లీనర్లు ఇలా సాధారణ జనానికి అత్యవసరమైనవన్నీ ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఇది ప్రజలందరికీ దీపావళికి స్వీట్ న్యూస్ అనే చెప్పాలి. ఇక వెయ్యి రూపాయలు కన్నా తక్కువగా ఉన్న రెడీమేడ్ వస్త్రాలు కూడా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. వెయ్యి రూపాయల ధరలోపు ఉన్న చెప్పులు కూడా ఇంకా తగ్గుతాయి. సైకిళ్లు, వ్యవసాయ యంత్రాల ధరలు కూడా తగ్గే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ఇక డిష్ వాషర్లు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టీవీలు వంటివి కూడా తగ్గే అవకాశం ఎక్కువ ఇక కార్లు ధరలు కూడా తగ్గుతాయి. అయితే అన్ని రకాల కార్లు కాదు... కేవలం చిన్నకార్ల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక ఖరీదైన ద్విచక్ర వాహనాలు కూడా ఎంతోకొంత తగ్గే అవకాశం ఉంది.
ముందే కొనుక్కోండి
పైన చెప్పిన వాటిలో మీ అవసరాన్ని బట్టి దీపావళిలోపు ఏవి కొనాలనుకుంటున్నారో ముందే కొనడం బెటర్. ధర తగ్గే వాటిలో మీరు కొనాలనుకున్నవి ఉంటే దీపావళి తర్వాత కొనండి. అదే వస్తువులు... ధర పెరిగే వాటిల్లో ఉంటే దీపావళిక ముందే కొనేసుకోవడం ఉత్తమం. దీపావళి నుంచి పేదవారికి, మధ్య తరగతి వారికి నిత్యావసరాలు తక్కువ ధరకే లభించబోతున్నాయి.