Gas Cylinder: దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ప్రభుత్వం.. ఎవరికో తెలుసా?
దీపావళి కానుకగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను (Gas Cylinder) ఇవ్వబోతోంది ప్రభుత్వం. పేద కుటుంబాల వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ ఆలోచన. ఇంతకీ ఎవరికి ఈ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను ఇవ్వబోతున్నారో తెలుసా?

ఉచితంగా గ్యాస్ సిలిండర్
మనదేశంలో అతి పెద్ద పండుగలో దీపావళి ఒకటి. ఈ పండుగకు పిండివంటలతో ఘుమఘుమలాడిపోతుంది. అందుకే ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను ఇవ్వబోతోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత సిలిండర్లను ప్రకటించింది. దీనివల్ల యూపీలోని 1.75 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందనుంది. ఉత్తర ప్రదేశ్ లో దీపావళి, హోలీ పండుగలు వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ రెండు పండుగలను ఉద్దేశించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ను అందించబోతున్నారు. ఈ సిలిండర్ ను ఈ నెలలోనే ఇవ్వబోతున్నారు.
ఏమిటి ఈ పథకం?
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఉత్తర ప్రదేశ్ లోని అర్హత కలిగిన మహిళలకు అందించే పథకం. పండుగ సమయంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తారు. లబ్ధిదారులు మొదట ఒక ఏజెన్సీ నుండి సిలిండర్ ను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఆ సిలిండర్ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తుంది. ప్రభుత్వ రీయంబర్స్ మెంట్ ద్వారా ఈ సిలిండర్ ను ఉచితంగా అందిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉందా?
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దీన్ని అందిస్తోంది. ఈ పథకం గురించి తెలిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని పేద మహిళలు కూడా తమకు ఇలాంటి పథకం అమలులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం లేదు.