- Home
- Business
- Salary Hike FY25: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఈ ఏడాది జీతాల పెంపు 4 శాతం మాత్రమే
Salary Hike FY25: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఈ ఏడాది జీతాల పెంపు 4 శాతం మాత్రమే
సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కష్టకాలం కొనసాగుతోంది. ఓ ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ ఈ ఏడాది తన ఉద్యోగులకు కేవలం 4 నుంచి 8 శాతం మాత్రమే జీతాల పెంపును ప్రకటించడం షాక్ కి గురిచేసింది. ఇదే దారిలో మరికొన్ని పెద్ద కంపెనీలు ఉన్నట్లు సమాచారం. కొత్త ఉద్యోగాలు లేక, ఉన్న వాటిలో గ్రోత్ లేక ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సాఫ్ట్ వేర్ రంగం ఇంకా నష్టాల్లోనే ఉందా? కంపెనీలు ప్రకటిస్తున్న జీతాల పెంపును గమనిస్తే ఇదే అనిపిస్తుంది. ప్రస్తుతం ఫ్రెషర్స్ కి కూడా ఉద్యోగాలు రావడంలేదు. సీనియర్ల జీతాల పెంపు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో సాఫ్ట్ వేర్ రంగం ఎప్పుడు మళ్లీ పూర్వ వైభవాన్ని చూస్తుందోనని ఎంప్లాయిస్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
సాఫ్ట్ వేర్ రంగంలో ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ 2025 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీతాల పెంపుపై తన ఉద్యోగులకు మెయిల్స్ చేసింది. జీతాల పెంపు 4-8 % వరకు ఉంటుందని అందులో ఉంది. ఈ విషయం తెలిసి ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మార్చిలో ఈ జీతాల పెంపు అమలు చేయనుందని, ఏప్రిల్ నుండి పేమెంట్స్ ప్రారంభమవుతాయని సమాచారం. గత ఐదు సంవత్సరాలుగా జీతాల పెంపు చాలా తక్కువగా ఉందని టీసీఎస్ ఉద్యోగులు బాధపడుతున్నారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులకు సగటున 7-9% జీతాల పెంపును మాత్రమే అందించింది. అయితే 2022లో ఇది 10.5 % గా ఉంది. కాని 2025లో కేవలం 4-8 % మాత్రమే జీతాల పెంపు ఉంటుందని ప్రకటించడం ఐటీ రంగంలోని ఒడిదొడుకులను ప్రతిబింబిస్తోంది.
కోవిడ్-19 కాలం నుంచి సాఫ్ట్ వేర్ రంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రాజెక్ట్స్ లేక ఉద్యోగాల్లో అభివృద్ధి లేక ఇప్పటికే ఉన్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఉద్యోగులు సతమతమైపోతున్నారు.
టీసీఎస్ దారిలోనే మరికొన్ని దిగ్గజ కంపెనీలు ఉన్నాయని సమాచారం. భారతదేశ ఐటీ రంగంలో రెండవ అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్ కూడా మార్చి నెలాఖరు నాటికి జీతాల పెంపును ప్రకటించే అవకాశం ఉంటుంది. టీసీఎస్ మాదిరిగానే, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల జీతాల పెంపు వివిధ వ్యాపార విభాగాల నుండి వచ్చిన సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది. ఎలా చూసుకున్నా ఈ ఏడాది ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగుల జీతాల పెంపు కూడా 5-8% వరకు మాత్రమే పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.