MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • సూపర్ న్యూస్: టాటా నుంచి రూ. 6 లక్షల కంటే తక్కువ ధరలో 3 కొత్త కార్లు

సూపర్ న్యూస్: టాటా నుంచి రూ. 6 లక్షల కంటే తక్కువ ధరలో 3 కొత్త కార్లు

ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కారు ఉండాలన్న రతన్ టాటా లక్ష్యాన్ని నెరవేర్చడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది. కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్ త్వరలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2025లో ఏకంగా మూడు కార్లను ఆవిష్కరించనుంది. అత్యంత తక్కువ ధరకే వీటిని మార్కెట్ లోకి తీసుకురానుండటం విశేషం. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 08 2025, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాటా మోటార్స్ మూడు కొత్త కార్లను ఆవిష్కరించనుంది. పంచ్, టియాగో, టిగోర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ ధర కూడా బడ్జెట్ లోనే ఉంటుందని సమాచారం. ప్రతి ఒక్క కుటుంబానికి కారు ఉండాలన్న రతన్ టాటా లక్ష్యాన్ని నెరవేర్చడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది. అందుకే కార్ల ధరలు తగ్గించి విడుదల చేయనుందని తెలుస్తోంది. 

ఆటో ఎక్స్‌పో (భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025) ఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి 17 నుంచి 22 వరకు జరుగుతుంది. అదేవిధంగా ద్వారకా యశోభూమిలో జనవరి 18-21 వరకు నిర్వహిస్తారు. గ్రేటర్ నోయిడా ఎక్స్‌పో మార్ట్ సెంటర్‌లో జనవరి 19 నుంచి 22 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్‌లో దేశ, విదేశ కంపెనీలతో పాటు దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

జనవరి 17 నుంచి ఢిల్లీ, నోయిడాలో కార్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఇందులో పలు ప్రముఖ కార్ కంపెనీలు తమ కార్లను ప్రదర్శించనున్నాయి. టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2025లో మూడు కొత్త కార్లను తీసుకురానుంది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలు తీరేలా ఈ కార్లు డిజైన్ చేసినట్లు టాటా కంపెనీ ప్రకటించింది. అందుకే వీటి ధర కూడా రూ.6 లక్షల లోపు ఉండనుందని సమాచారం. ఈ ఏడాది మూడు కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని టాటా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్న టాటా కొత్త కార్ల గురించి తెలుసుకుందాం రండి. 
 

35

1. టాటా పంచ్ (Tata Punch Facelift)
టాటా మోటార్స్ ప్రముఖ మైక్రో SUV పంచ్ న్యూ లుక్ తో మార్కెట్ లోకి రానుంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, కొత్త గ్రిల్, DRL లైట్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాత ఫీచర్లు ఇందులో ఉంటాయట. దీని ధర దాదాపు రూ.6 లక్షలు ఉండవచ్చని అంచనా.
 

45

2. టాటా టియాగో (Tata Tiago Facelift)
సైజులో చిన్నగా, డిజైన్ లో అందంగా ఉంటుంది టాటా టియాగో. టాటా కంపెనీకి ఇష్టమైన కార్లలో ఒకటైన టియాగో కొత్త వెర్షన్ కూడా ఎగ్జిబిషన్‌లో మెరవనుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కొత్త హెడ్‌ల్యాంప్, DRLతో కూడిన రేడియేటర్ గ్రిల్, వైర్‌లెస్ ఛార్జింగ్, USB టైప్-C పోర్ట్, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. దీని ధర కూడా రూ.5 లక్షలు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 

55

3. టాటా టిగోర్ (Tata Tigor Facelift)
టాటా ప్రముఖ సెడాన్ టిగోర్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఎగ్జిబిషన్‌లో ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండవచ్చు. ఈ కారు లీటరు పెట్రోల్‌కు 19.43 నుంచి 28.06 కి.మీ. మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధర 6 లక్షలు ఉండవచ్చు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved