MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • స్విగ్గి, జొమోటో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారా? ఎంత నష్టపోతున్నారో తెలుసా? అంతా దోపిడీ

స్విగ్గి, జొమోటో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారా? ఎంత నష్టపోతున్నారో తెలుసా? అంతా దోపిడీ

స్విగ్గి, జొమోటో నుండి ఫుడ్ ఆర్డర్లు చేసుకునే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఆ యాప్‌లలో తక్కువ ధరకే వస్తుందని ఎంతోమంది అనుకుంటారు. అలాగే ఇంటికి తెచ్చిస్తున్నారని ఆనందపడతారు. నిజానికి మిమ్మల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 09 2025, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్
Image Credit : Pixabay

స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్

స్విగ్గి, జొమోటో నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని తక్కువకే వచ్చింది లే... అని సంతోష పడిపోయేవారు ఎంతోమంది. నిజానికి మీరు రెస్టారెంటుకెళ్ళి నేరుగా తినే కన్నా రెట్టింపు ధరకు స్విగ్గి, జొమోటో నుండి ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు.. స్వయంగా ఒక వ్యక్తి తన అనుభవాన్ని వివరించాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రేట్ల మధ్య తేడా
Image Credit : X/Sunder

రేట్ల మధ్య తేడా

కోయంబత్తూరుకు చెందిన సుందర్ అనే ఒక యూజర్ తన ఆన్లైన్ ఆర్డర్ స్క్రీన్ షాట్ ను, అలాగే నేరుగా రెస్టారెంట్ కి వెళ్లి తినడం వల్ల ఎంత బిల్లు వచ్చిందో... అది కంపేర్ చేస్తూ పోస్టు పెట్టాడు. దాదాపు రెట్టింపు ధరలకు స్విగ్గి, జొమోటోలో అమ్ముతున్నట్టు బయటపడింది. అతను స్విగ్గీ ద్వారా పరాటాలు, చికెన్ 65, చికెన్ లాలీపాప్స్, చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు. దీని మొత్తం బిల్లు 1473 రూపాయలు. అతను అదే ఆహారాన్ని నేరుగా రెస్టారెంట్ కి వెళ్లి కొనుగోలు చేశాడు. కేవలం 810 రూపాయలు మాత్రమే చెల్లించాడు. అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల మనం రెట్టింపు ధరలను చెల్లించాల్సి వస్తోంది.

35
ధరలు ఇవిగో
Image Credit : Pixabay

ధరలు ఇవిగో

స్విగ్గీలో ఒక పరాటా ధర 35 రూపాయలే ఉంటే.. అదే రెస్టారెంట్లో కేవలం రూ.20కే లభిస్తోంది. అలాగే చికెన్ 65 ధర స్విగ్గీలో 240 రూపాయలు ఉంటే.. నేరుగా రెస్టారెంట్లో 150 రూపాయలకే దొరుకుతోంది. ఇంతగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లలో ధరలను అధిక మొత్తానికి అమ్ముతున్నారు. పైగా డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పి మోసం చేస్తున్నారు. దీనివల్ల వారికి రెట్టింపు ఆదాయం వస్తోంది. అందుకే స్విగ్గి, జొమోటోలా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.

45
ఇంత అన్యాయంగా అమ్ముతారా?
Image Credit : Pixabay

ఇంత అన్యాయంగా అమ్ముతారా?

సుందర్ పెట్టిన ఈ పోస్టు ఆన్లైన్లో వైరల్ గా మారింది. ఇంత అధిక ధరలకు తాము స్విగ్గీ, జొమోటోలలో ఆర్డర్ చేస్తున్నామా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది మాత్రం ఇంటికి తెచ్చిస్తున్నారు. కాబట్టి సౌలభ్యం కోసం అధిక ధర చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇంటికి తెచ్చి ఇచ్చినందుకు ఒక 100 రూపాయలు అధికంగా తీసుకున్న పర్వాలేదు.. కానీ ఏకంగా రెట్టింపు ధరలకు అమ్మడం అన్యాయమని వాదిస్తున్నారు కొంతమంది.

55
కమిషన్ ఇవ్వాలి అందుకే...
Image Credit : Swiggy and Zomato

కమిషన్ ఇవ్వాలి అందుకే...

స్విగ్గి,జొమాటోలతో అనుసంధానమైన రెస్టారెంట్లు ఆ యాప్ లకు కొంత కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ కమిషన్ 24% నుంచి 28% వరకు ఉంటుంది. ఆ కమిషన్ డబ్బులను తిరిగి పొందాలంటే రెస్టారెంట్లు ఆన్లైన్లో పెట్టిన మెనూలో ధరలను పెంచేస్తున్నాయి. ఆ భారం కస్టమర్ల పైనే పడుతుంది. అందుకే మధ్యలో డెలివరీ యాప్‌లు కోట్లు గడిస్తున్నాయి.

గతంలో స్విగ్గీ ఇదే విషయంపై స్పందించింది. రెస్టారెంట్లు ఆన్లైన్ స్విగ్గీ, జొమోటోలో పెట్టే ధరలపై తమకి ఎటువంటి నియంత్రణ లేదని స్పష్టంగా చెప్పింది. ఆన్లైన్లో, ఆఫ్ లైన్లో ధరలు ఎంత పెట్టుకోవాలన్నది రెస్టారెంట్ ఇష్టమేనని ఆ కంపెనీ వివరించింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు షాక్.. పండుగ సీజన్ లో దెబ్బకొట్టారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved