ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కోసం సూపర్ యాప్.. 'EHUB'
దేశ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్వర్క్ ను యాక్సెస్ చేసేందుకు JSW MG మోటార్ ఇండియా ముందడుగు వేసింది. ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యమై 'ehub' అనే యాప్ ను తీసుకొస్తోంది. ఈ సంచలన నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల(EV) వినియోగదారుల ఛార్జింగ్ సమస్యను తీరుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ అంశంపై JSW MG మోటార్ ఇండియా సీఈఓ ఎమెరిటస్ రాజీవ్ చాబా చెప్పిన మరిన్ని విషయాలు ఇవిగో...
బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్(BEV) యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి JSW MG మోటార్ ఇండియా... అదానీ టోటల్ ఎనర్జీ లిమిటెడ్ (ATEL), BPCL, CHARGE ZONE, GLIDA,HPCL, JIO-BP, SHELL, STATIQ, ZEON వంటి ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం అయింది. 'EHUB' పేరుతో ఏకీకృత ఛార్జింగ్ యాప్ ను విడుదల చేయనున్నారు. ఇది 11 భాషల్లో అందుబాటులో ఉంటుంది. EV వినియోగదారులు వారు ప్రయాణించే మార్గాల్లో ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
*రాజీవ్ చాబా ఏమన్నారంటే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 వేల ఛార్జింగ్ పాయింట్లు ఉండగా, వాటిలో దాదాపు 8500 తమ యాప్ లో ఉన్నాయని MG మోటార్ ఇండియా CEO ఎమెరిటస్ రాజీవ్ చాబా వెల్లడించారు. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జర్లని తెలిపారు. టాటా పవర్ ఆపరేట్ చేసే ఛార్జర్లను మాత్రం ehub యాప్ ద్వారా ఉపయోగించలేమన్నారు.
*MG తో 80 శాతం కంపెనీలు..
ఇంటర్-సిటీ హైవేలలో ఎక్కువ రియల్ ఎస్టేట్ స్థలాలు కలిగిన ప్రముఖ కంపెనీలన్నీ తమతో భాగస్వామ్యం అయ్యాయని మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు. దాదాపు 80 శాతం EV ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు తమతో ఉన్నాయన్నారు. Ehugతో పాటు బ్యాటరీ సెకండ్ లైఫ్ ప్రాజెక్ట్, EV ఎడ్యుకేషన్, MG-Jio ICP వంటి కార్యక్రమా లను నిర్వహిస్తున్నామని గౌరవ గుప్తా తెలిపారు.
JIO తోనూ కలిసిన MG మోటార్స్..
MG మోటార్స్ జియో తో కలిసి జియో ఇన్నోవేటివ్ కనెక్టివిటీ ప్లాట్ ఫామ్ (MG-jio ICP) ను తీసుకురానుంది. ఈ సదుపాయం త్వరలో రానున్న అన్ని MG వాహనాల్లో ఉంటుంది. ఇది ఇన్ కార్ గేమింగ్, ఎంటర్ టైన్మెంట్, లెర్నింగ్ తదితర ఫీచర్స్ ని అందించనుంది. ఆరు భారతీయ భాషల్లో MG-jio ICP సేవలు అందించనుంది.