- Home
- Business
- స్టాక్ మార్కెట్లో మళ్ళీ కరోనా కలకలం: ఈ సంవత్సరంలో సెన్సెక్స్ పెట్టుబడిదారులకు 3వ అతిపెద్ద ఎదురుదెబ్బ..
స్టాక్ మార్కెట్లో మళ్ళీ కరోనా కలకలం: ఈ సంవత్సరంలో సెన్సెక్స్ పెట్టుబడిదారులకు 3వ అతిపెద్ద ఎదురుదెబ్బ..
నేడు శుక్రవారం మరోసారి స్టాక్ మార్కెట్(stock market)లో కరోనా చీకటి నీడ(dark shadow)కనిపించింది. దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన కోవిడ్-19(covid-19) కొత్త వేరియంట్ ఓమిక్రాన్(Omicron ) భయాలు స్టాక్ మార్కెట్‌లో భయాందోళనలకు కారణమైంది దీంతో సెన్సెక్స్(sensex) 1687 పాయింట్లు పడిపోయింది. అలాగే ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది.

కరోనా ఈ కొత్త వేరియంట్ ప్రభావం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో కనిపించింది. ఈ ఏడాది సెన్సెక్స్‌లో ఇది మూడో భారీ పతనం కాగా, గత ఏడు నెలల్లో ఇదే అతిపెద్ద పతనం. కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్ ఎప్పుడు ఎంత పడిపోయిందో చూద్దాం...
బిఎస్‌ఈ సెన్సెక్స్ 1687 పాయింట్లు
శుక్రవారం లేదా ఈ వారం ట్రేడింగ్ చివరి రోజున భారతీయ స్టాక్ మార్కెట్‌కు మరో బ్లాక్ డేగా మారింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE 30-షేర్ సెన్సెక్స్ 161687.94 పాయింట్లు లేదా 2.87 శాతం క్షీణించి 57,107.15 వద్ద ముగిసింది, NSE నిఫ్టీ 509.80 పాయింట్లు లేదా 2.91 శాతం నష్టపోయి 17026.45 వద్ద ముగిసింది. అయితే ఇది గత ఏడు నెలల్లో సెన్సెక్స్‌లో అతిపెద్ద పతనం అలాగే 2021 సంవత్సరంలో మూడవ అతిపెద్ద పతనం.
శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్క రోజులో ఏడు లక్షల కోట్ల రూపాయలకు పైగా మునిగిపోయారు. అందిన సమాచారం ప్రకారం సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.7.45 లక్షల కోట్లు నష్టపోయారు. కరోనా కొత్త వేరియంట్ Omicron (Omicron) వేరియంట్ దీనికి కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త రకం కోవిడ్ వైరస్ కారణంగా, బలహీనమైన ప్రపంచ స్టాక్ మార్కెట్ల లాగానే దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయని నిపుణులు తెలిపారు.
ఈ ఏడాది సెన్సెక్స్‌లో భారీ పతనం
ఈ ఏడాది సెన్సెక్స్‌లో ఇది మూడో అతిపెద్ద పతనం. ఇప్పటి వరకు ఈ సంవత్సరం ప్రారంభం గురించి మాట్లాడితే ఫిబ్రవరి 26న సెన్సెక్స్ 1,939 పాయింట్లు బద్దలు కావడంతో BSE సెన్సెక్స్‌లో అతిపెద్ద పతనం జరిగింది. దీని తరువాత సెన్సెక్స్ ఏప్రిల్ 12న 1,707 పాయింట్లు పడిపోయింది. ఇప్పుడు నవంబర్ 26 శుక్రవారం సెన్సెక్స్ 1,687 పాయింట్ల పతనంతో ముగిసినప్పుడు పెట్టుబడిదారులకు మూడవసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
కరోనా కాలంలో సెన్సెక్స్ దశ
తేదీ సంవత్సరం పతనం
12మార్చి 2020 2919
16మార్చి 2020 2713
23మార్చి 2020 3934
4మే 2020 2002
18మే 2020 1068
26 ఫిబ్రవరి 2021 1939
12 ఏప్రిల్ 2021 1707
26 నవంబర్ 2021 1687
అక్టోబరులో 62 వేల పాయింట్లు
గణాంకాలను పరిశీలిస్తే శుక్రవారం సెన్సెక్స్ 1687 పాయింట్లు నష్టపోవడంతో గత ఏడు నెలల్లోనే అతిపెద్ద పతనం. గత నెల అక్టోబర్ 19న సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 62,245 పాయింట్లను తాకింది. అయితే దీని తర్వాత స్టాక్‌మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా డౌన్‌ట్రెండ్‌ను ప్రారంభించి ఇప్పటి వరకు గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు పది శాతం పతనమైంది.
యు.ఎస్ స్టాక్ మార్కెట్‌తో శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ల భయాందోళనలో కనిపించింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న Omicron వేరియంట్ వల్ల దక్షిణ ఆఫ్రికా నుండి యూరోపియన్ యూనియన్ వచ్చే విమాన ప్రయాణాలని నిలిపివేసింది. కొన్ని దేశాలలో ఆంక్షలను మళ్లీ విధించడం వల్ల యూఎస్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ S&P 500 2.27 శాతం నష్టపోయింది అంటే సెప్టెంబర్ చివరి నుండి భారీ క్షీణత. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 905 పాయింట్లకు పైగా పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ కూడా 2.23 శాతం క్షీణించింది.