MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Silver: బంగారం కంటే వెండిలో పెట్టుబడి పెడితే 77 శాతం లాభాలు: రికార్డ్స్ ఇవే చెబుతున్నాయి

Silver: బంగారం కంటే వెండిలో పెట్టుబడి పెడితే 77 శాతం లాభాలు: రికార్డ్స్ ఇవే చెబుతున్నాయి

Silver: మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఎక్కువ డబ్బులు లేవని చింతిస్తున్నారా? అయితే వెండిలో ఇన్వెస్ట్ చేయండి. తక్కువ పెట్టుబడి, నమ్మకమైన ఆదాయం పొందొచ్చు. వెండిలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 31 2025, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెరుగుతున్న వెండి మోజు
Image Credit : iSTOCK

పెరుగుతున్న వెండి మోజు

బంగారం మాదిరిగా వెండిలోనూ పెట్టుబడి పెట్టే ఆలోచన పెరుగుతోంది. ఇప్పుడు వెండి ఆభరణాలు కూడా బంగారం రంగులో లభించడంతో వినియోగదారులు ఎక్కువగా వెండికి మొగ్గు చూపుతున్నారు. అనేక నకిలీ మాల్స్, నగల షాపుల్లో వెండికి కూడా సీట్ టోకెన్లు ఇవ్వడం ప్రారంభమైంది. ముఖ్యంగా పెళ్లిళ్లలో వెండి వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది. వెండి పట్టీలు, గొలుసులు, తాళి చైన్, ముక్కుపుడక, వంకీలు, మెట్టెలు ఇలా వెండి ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. 

25
లాభాలు తెచ్చిన వెండి
Image Credit : iSTOCK

లాభాలు తెచ్చిన వెండి

బంగారం బిస్కెట్ల మాదిరిగానే వెండి బార్ల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. గత సంవత్సరం కాలంలో వెండి సగటున 15% లాభం తెచ్చింది. గత 10 సంవత్సరాల్లో వెండి 9% వృద్ధిని నమోదు చేసింది. ఇది బంగారంతో పోలిస్తే తక్కువేం కాదు. 2015 నుంచి 2020 మధ్య కాలంలో వెండి ధర 14–19 డాలర్ల మధ్య నడిచింది. 2020 ఏప్రిల్ నుంచి తిరిగి పెరుగుదల ప్రారంభమైన వెండి, ఆగస్టు 2020 నాటికి 28 డాలర్లను తాకింది.

Related Articles

Related image1
Gold: ఏంటి.. భూగర్భంలో మిగిలిన బంగారం 53 వేల టన్నులేనా? మరి ఇండియాలో ఎంత?
Related image2
ప్రపంచ‌వ్యాప్తంగా బంగారం ధర పెరుగుతుంటే.. పాకిస్థాన్‌లో తగ్గిపోతోంది: కారణం ఇదే!
35
77% లాభాన్ని తెచ్చిన వెండి
Image Credit : Pinterest

77% లాభాన్ని తెచ్చిన వెండి

2020లో భారత మార్కెట్లో వెండి ధర కిలో రూ.75,000 కాగా, ప్రస్తుతం రూ.1.10 లక్షలకు పైగా ఉంది. 2022లో ఇది తిరిగి 18 డాలర్లకి పడిపోయినా, ఇప్పుడే మళ్లీ 33 డాలర్లకి చేరుకుంది. అంటే వెండి 77% లాభాన్ని ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

45
వెండి పెట్టుబడిపై నిపుణులు ఏమంటున్నారు
Image Credit : Pinterest

వెండి పెట్టుబడిపై నిపుణులు ఏమంటున్నారు

నిపుణులు చెబుతున్నట్లు వెండిని సాధారణంగా ఆభరణాలుగా లేదా బార్ల రూపంలో కాకుండా ETF (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) రూపంలో కొనుగోలు చేస్తే పెట్టుబడికి మంచి మార్గమవుతుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడిన పెట్టుబడి. వ్యక్తిగత పెట్టుబడి పోర్ట్ ఫోలియోలో వెండిని కనీసం 10% చేర్చితే మంచి లాభం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

55
ఎప్పుడు వెండిని కొనాలి?
Image Credit : Getty

ఎప్పుడు వెండిని కొనాలి?

2025 మే 22న 24 క్యారెట్ బంగారం ధర రూ.9,790/గ్రా కాగా, వెండి ధర రూ.112/గ్రా ఉంది. ఓ అధ్యయనం ప్రకారం బంగారం, వెండి ధరల నిష్పత్తి 70కు పైగా ఉన్నపుడే వెండిని కొనడం మంచిదని తేలింది.

చిన్న పెట్టుబడిదారులు ఇప్పుడు వెండిని ఎంచుకుని లాభాలను పొందుతున్నారు. పేద ప్రజలు కూడా ఆభరణాల రూపంలో వెండిని కొనుగోలు చేసినా, అది మంచి పెట్టుబడిగా మారే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బంగారం
స్టాక్ మార్కెట్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: ఏం చేయ‌కుండానే 5 ఏళ్ల‌లో రూ. 4 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. ప్ర‌భుత్వ గ్యారెంటీతో
Recommended image2
Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?
Recommended image3
మ‌హిళ‌లు ఇలా చేస్తే మీరే మ‌హా రాణులు.. ఇంట్లో నుంచే నెల‌కు రూ. 25 వేలు సంపాదించే అవ‌కాశం
Related Stories
Recommended image1
Gold: ఏంటి.. భూగర్భంలో మిగిలిన బంగారం 53 వేల టన్నులేనా? మరి ఇండియాలో ఎంత?
Recommended image2
ప్రపంచ‌వ్యాప్తంగా బంగారం ధర పెరుగుతుంటే.. పాకిస్థాన్‌లో తగ్గిపోతోంది: కారణం ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved