Gold Rates: పద్నాలుగేళ్లలో రికార్డు స్థాయి ధరకు వెండి, బంగారం.. ఇలా అయితే కొనడం కష్టమే
పండుగల సీజన్ ప్రారంభమైపోతుంది. అలాగే పెళ్లిళ్ల సీజన్ కూడా వచ్చేస్తోంది. అందుకే బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వాటి ధరలు 14 ఏళ్లలో మొదటిసారి ఎక్కువ ధరకు చేరుకున్నాయి.

బంగారం కొనే పండుగలు
పెళ్లిళ్లు సీజన్ ప్రారంభమైపోయింది. అలాగే ధంతేరాస్, దీపావళి, దుర్గాపూజ వంటి పండగలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ మూడు పండగలు మన దేశంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. పెళ్లిళ్లకు, ధంతేరాస్‌కు, దీపావళికి, దసరాకు బంగారం కొనే ఆచారం ఎంతోమందికి ఉంది. బంగారం, వెండి ఆభరణాలు ఈ సీజన్లోనే అధికంగా అమ్ముడవుతాయి. అంతేకాదు పెళ్లయినా, పండుగ అయినా బంగారం కొనడం మనదేశంలో శుభప్రదంగా భావిస్తారు.
కిలో వెండి ఎంత?
బంగారం,వెండి ధరలు పద్నాలుగేళ్లలో ఆల్ టైం రికార్డు ధరలకు చేరుకున్నాయి.ఇప్పుడు బంగారం,వెండి కొనాలంటే ఎక్కువ డబ్బులను ఖర్చు చేయాలి.ఎందుకంటే బంగారం ధర రికార్డు స్థాయిలో ఉంది 10 గ్రాముల బంగారం 1,05,000 రూపాయలు దాటిపోయింది. ఇక ఆభరణాల రూపంలో కొనాలంటే దీని ధర లక్షన్నర దాటిపోతుంది. అంటే మీరు తులం వస్తువు కొనాలంటేనే లక్షన్నర రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. బంగారం ధర నిరంతరం పెరుగుతూనే వస్తోంది. వెండి ధరలలో కూడా పెరుగుదల కనిపించింది.
ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు రికార్డులను బద్దలు కొట్టేలా పెరిగాయి. రూపాయి బలహీన పడడం వల్ల వెండి ధర కిలో 1,23,000 రూపాయలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గత 14 ఏళ్లలో గరిష్ట స్థాయి వెండి ధరలు ఇవే. దీన్నిబట్టి బంగారమే కాదు వెండి కొనడం కూడా కష్టమే అయిపోయింది. సాధారణ ప్రజలపై ఈ ప్రభావం అతిగా పడుతుంది.
బంగారం ధరలు ఎందుకు పెరిగాయి?
అమెరికా విధించే సుంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు వంటివన్నీ కూడా బంగారం ధరపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. అమెరికా సుంకాలకు సంబంధించి ఒక అనిశ్చితి ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు దృష్టి మారిపోయింది. డాలర్ పై ఒత్తిడి పెరగడంతో బంగారం ధర కూడా పెరగడం ప్రారంభమైంది. చాలామంది సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారం వైపే ఇప్పుడు అంతా చూస్తున్నారు. దీంతో బంగారం ధర నిత్యం పెరుగుతూనే వస్తోంది.
ఏడాదిలో ఎంత పెరిగిందంటే?
ఏడాది సమయంలోనే బంగారం ధర భారీగా పెరిగింది. దాదాపు 32 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 2025లో బంగారం ధర 10 గ్రాములు 80 వేల రూపాయలుగా ఉంది. ఇప్పుడు 10 గ్రాములు లక్షా ఐదు వేల రూపాయలకు చేరుకుంది. బంగారం డిమాండ్ ఇలాగే ఉంటే పేద ప్రజలు, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితిగా మారే అవకాశం ఉంటుంది.
బంగారం ధరలు ఇలా
సెప్టెంబర్ 1, 2025న ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రకారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
999 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు 1,02,390 రూపాయలుగా ఉంది.
995 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు లక్ష 1,01,980 రూపాయలుగా ఉంది.
916 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు 93,790 రూపాయలుగా ఉంది.
ఇక 750 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాముల ధర 76,790 రూపాయలుగా ఉంది.