- Home
- Business
- Credit card Tips: పండగకు క్రెడిట్ కార్డుతో EMI షాపింగ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే మీకే నష్టం
Credit card Tips: పండగకు క్రెడిట్ కార్డుతో EMI షాపింగ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే మీకే నష్టం
దసరా, దీపావళి ఇలా వరుస పండుగల సమయంలో షాపింగ్ చేసేవారు ఎక్కువ. ఎంతోమంది పెద్ద కొనుగోళ్లను క్రెడిట్ కార్డ్‌తో (credit card) EMIలో చేస్తారు. క్రెడిట్ కార్డు షాపింగ్ చేసేటప్పుడు చిన్నచిన్న పొరపాట్లు మీకు నష్టాన్ని తెస్తాయి.

పండుగ షాపింగ్
పండుగ సీజన్లోనే ఎంతో మంది భారీగా షాపింగ్ చేస్తారు. దుస్తుల దగ్గర నుంచి వాహనాల వరకు కొంటారు. ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన వస్తువులను క్రెడిట్ కార్డుతో ఈఎమ్ఐ పద్దతిలో కొంటారు. అలా కొనేటప్పుడు వడ్డీ రేటు, మొత్తం చెల్లింపును పట్టించుకోకపోతే మీకు డబ్బు నష్టం రావచ్చు. కొనే ముందు EMI కాలిక్యులేటర్ వాడి మీ నెలవారీ బడ్జెట్‌లో ఆ ఈఎమ్ఐను సులభంగా చెల్లించగలరో చెక్ చేసుకోండి. కొనేశాక ప్రతి నెలా ఈఎమ్ఐ కట్టే సమయంలో ఇబ్బందిపడకుండా ఉంటారు.
ఈఎమ్ఐ కాలపరిమితి
ఎక్కువ కాలపరిమితితో EMIలో షాపింగ్ చేయడం అంత మంచి పద్దతి కాదు. అసలు కన్నా వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. 12 నెలల కంటే ఎక్కువ EMI తీసుకుంటే వడ్డీ, ఇతర ఫీజులు అధికంగా పెరిగిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా తక్కువ కాలపరిమితి ఉన్న EMIని ఎంచుకోవడమే ఉత్తమ. దీనివల్ల వడ్డీ చాలా వరకు తగ్గి, అసలు మొత్తం త్వరగా తీరుతుంది.
క్రెడిట్ లిమిట్ ని బట్టి
మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను పట్టించుకోకుండా అవసరానికి మించి ఖర్చు చేయకండి. దీనివల్ల ఓవర్ లిమిట్ ఛార్జీలు పెరిగిపోతాయి. దీనివ్ల ఆర్థిక ఒత్తిడి పెరగొచ్చు. ఎప్పుడూ మీ క్రెడిట్ లిమిట్, అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోండి.
నా కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు
పండగ సీజన్‌లో చాలా బ్యాంకులు, బ్రాండ్లు నో-కాస్ట్ EMI ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. అలాంటివి ఎంపిక చేసుకోని షాపింగ్ చేయాలి. ఈ ఆఫర్లలో ప్రాసెసింగ్ ఫీజు లేదా ఇతర ఛార్జీల వంటివి షరతులు ఉంటాయి. వాటిని కూడా తెలుసుకున్నాకే షాపింగ్ చేయండి.
ఆలో పేమెంట్ సెట్టింగ్స్
మీరు ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నా లేదా EMI ప్లాన్‌లు అధికంగా ఉన్నా వాటిని సమయానికి నిర్వహించడం కష్టంగా మారుతుంది. దీనివల్ల బిల్లు చెల్లింపులు మిస్ అవుతాయి… దానికి తగ్గ ఆలస్య రుసుము కూడా కట్టాల్సి రావచ్చు. కాబట్టి EMI ఆటో-పేమెంట్ సెట్ చేసుకోవడం ఉత్తమం.