- Home
- Business
- SBI: ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ: వడ్డీ రేట్లు తగ్గించడంతో పెట్టుబడిదారుల్లో నిరాశ.. ఎంత తగ్గాయో తెలుసా?
SBI: ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ: వడ్డీ రేట్లు తగ్గించడంతో పెట్టుబడిదారుల్లో నిరాశ.. ఎంత తగ్గాయో తెలుసా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించి ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఈ మార్పులు జూన్ 15, 2025 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. ఈ సమాచారంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవలే హోమ్ లోన్స్ పై వడ్డీ తగ్గించింది. అయితే ఇల్లు కొనాలనుకొనే వారు, కట్టుకోవాలనుకొనే వారికి ఇది మంచి అవకాశం.
ఇప్పుడు తాజాగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చింది. దీంతో లాంగ్ టర్న్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఇబ్బందికర పరిస్థితే. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడంతో వరుసగా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల తగ్గింపు
ఎస్‌బీఐ తాజా ప్రకటన ప్రకారం కొన్ని వాయిదా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.25 శాతం వరకూ తగ్గాయి. ప్రత్యేకించి 1 నుండి 2 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న FD స్కీములపై వడ్డీ రేట్లు ఇప్పుడు 6.80% నుంచి 6.55%కి తగ్గాయి. సీనియర్ సిటిజెన్స్‌కు మాత్రం యధాతధంగా అదనపు 0.50% వడ్డీ రేటు వర్తించనుంది.
రూ.3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు పెట్టుబడి వ్యవధిని బట్టి వడ్డీ రేట్లు 5 నుండి 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గాయి. ఉదాహరణకు 7 నుండి 45 రోజుల వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేటు 3.50% నుండి 3.00% కి తగ్గాయి.
అమృత్ కలశ్ పథకం క్యాన్సిల్
వడ్డీ రేట్ల తగ్గింపులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలను మాత్రమే కాకుండా, ఎస్‌బిఐ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం 'అమృత్ కలశ్' ఆపేయడానికి కూడా దారితీసింది. ఈ పథకం 400 రోజుల కాలవ్యవధిలో సాధారణ ఖాతాదారులకు 7.10%, సీనియర్ సిటిజన్లకు 7.60% వడ్డీ రేటును అందించిది. ఈ పథకం ఇప్పుడు నిలిపివేశారు. కాబట్టి డిపాజిటర్లు సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణ ఖాతాదారులకు వడ్డీ రేట్లు ఇప్పుడు 7 నుండి 45 రోజుల స్వల్పకాలిక డిపాజిట్లకు 3.00% నుండి గరిష్టంగా 6.50% వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అయితే అదనంగా 50 బేసిస్ పాయింట్లతో ప్రయోజనం పొందుతారు. అంటే 7.00% లభిస్తుంది.
ఇతర బ్యాంకుల్లోనూ FDలపై ప్రభావం
ఎస్‌బీఐ నిర్ణయం భారతీయ బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇటీవల తన స్థిర డిపాజిట్ రేట్లను సవరించింది. 2 సంవత్సరాల నుండి ఒక రోజు నుండి 10 సంవత్సరాల వరకు రూ.3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు 6.60% అందిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్లపై 7.10% వరకు అందిస్తున్నారు. ఈ సవరణలు రిటైల్, సీనియర్ డిపాజిటర్లకు వర్తిస్తుంది.
పెట్టుబడి దారులు వేరే మార్గాలు చూసుకోవాలి
ఈ వడ్డీ రేట్ల మార్పులు బడ్జెట్ తర్వాత దేశీయ ఆర్థిక విధానాల్లో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా అర్థమవుతోంది. ఇప్పటికే మార్కెట్‌లో పలువురు ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ రేట్లపై సవరణలు చేసిన సంగతి తెలిసిందే.
ఖాతాదారులు తమ డిపాజిట్, సేవింగ్స్ స్కీములపై సమగ్ర అవగాహన తీసుకోవాలని, ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప బ్రాంచ్‌లో సంప్రదించాలని సూచించింది.
ఈ మార్పుల వల్ల స్థిర ఆదాయం కోసం ఎఫ్‌డీలపై ఆధారపడిన పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఇతర బ్యాంకులు కూడా ఈ విధంగా వడ్డీ రేట్లను మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి.

