- Home
- Business
- Samsung Galaxy S23: ఫ్లిప్ కార్ట్‌లో భారీ ఆఫర్! శాంసంగ్ గెలాక్సీ S23పై రూ.50,000 వరకు తగ్గింపు!
Samsung Galaxy S23: ఫ్లిప్ కార్ట్‌లో భారీ ఆఫర్! శాంసంగ్ గెలాక్సీ S23పై రూ.50,000 వరకు తగ్గింపు!
Samsung Galaxy S23: శాంసంగ్ గెలాక్సీ S23 256 GB స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర బాగా తగ్గింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్‌లో దాదాపు రూ.50,000 వరకు తగ్గింపుతో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ పై ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, హోమ్ అప్లయెన్సెస్, క్లాత్స్ ఇలా అన్ని రకాల వస్తువలపై భారీగా డిస్కౌంట్స్ ఇస్తోంది. ముఖ్యంగా టీవీలు, సెల్ ఫోన్లపై అత్యధికంగా తగ్గింపు ఇస్తోంది. మీరు గాని మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, బడ్జెట్ గురించి టెన్షన్ పడుతుంటే ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ను వినియోగించుకోండి. శాంసంగ్ గెలాక్సీ S23 256 GB స్టోరేజ్ ఉన్న ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఏకంగా రూ.50 వేలు డిస్కౌంట్ ఇస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S23 అసలు ధర
ఆన్‌లైన్ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 256GB అసలు ధర రూ.95,999. కానీ ఫ్లిప్ కార్ట్ లో దాని ధర బాగా తగ్గింది. శాంసంగ్ గెలాక్సీ S23 లో పవర్ఫుల్ కెమెరా, బెస్ట్ ప్రాసెసర్ ఉన్నాయి. ఈ మొబైల్‌ను తక్కువ ధరకే మీరు కొనొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S23 రూ.50,000 డిస్కౌంట్
శాంసంగ్ గెలాక్సీ S23 256 GB స్టోరేజ్ ఫోన్ ను ఇప్పుడు మీరు కొనాలనుకుంటే సుమారు రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ తన కస్టమర్లకు ఈ ఫోన్ పై ఏకంగా 56% డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ వల్ల మొబైల్ ఇప్పుడు కేవలం రూ.41,999కి లభిస్తుంది.
క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
కస్టమర్లు ఫ్లిప్ కార్ట్ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా ఇంకా ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవాళ్లు ఫ్లిప్ కార్ట్ ఇచ్చే ఆఫర్‌తో పాటు 5% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. IDFC బ్యాంక్ కార్డులు వాడితే రూ.750 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్
ఒకవేళ మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసి శాంసంగ్ గెలాక్సీ S23 మొబైల్ కొంటే, రూ.39,150 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత మొబైల్ వర్కింగ్ కండీషన్ నిబట్టి మీకు ఎంత ఆఫర్ వస్తుందో తెలుస్తుంది. ఇలా రూ.15,000 ఆదా చేసినా ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను రూ.26,999కి కొనొచ్చు.