Safest Cars: రూ.7 లక్షల్లోపు ఇంత మంచి, సేఫ్టీ కార్లు ఉన్నాయా?
Safest Cars: కార్ల కంపెనీల ఆలోచనలు మారాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మంచి ఫీచర్స్ తో పాటు సేఫ్టీకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ తో కార్లు రిలీజ్ చేస్తున్నాయి. రూ.7 లక్షల్లోపు 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇప్పుడు చాలామంది సేఫ్టీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే కార్ల కంపెనీలు తమ కార్లను స్ట్రాంగ్‌గా, సేఫ్టీ ఫీచర్లతో రిలీజ్ చేస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని కార్లలో కనీసం రెండు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాలని రూల్ పెట్టింది.
వినియోగదారుల అభిప్రాయాలు, అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కంపెనీలు ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో కార్లను రిలీజ్ చేస్తున్నాయి. మీరు మంచి సేఫ్టీ కార్ కోసం చూస్తుంటే, ఇక్కడున్న కార్లలో బెస్ట్ ఆప్షన్ ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.92 లక్షలు. ఇది 82 bhp పవర్, 114 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్
చిన్న కారే అయినా ఇందులో ఏకంగా 6 స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), వెనుక పార్కింగ్ కెమెరా, స్టైలిష్ డిజైన్, సేఫ్టీ ఫీచర్లతో తక్కువ బడ్జెట్ లోనే మార్కెట్ లో ఈ కారు మీకు లభిస్తుంది.
మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియో ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.5.64 లక్షలు. ఇది 67 bhp పవర్, 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్
ఇందులో కూడా 6 స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. మూడు పాయింట్ల సీట్ బెల్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి కారు కొనేటప్పుడు ఇలా చేస్తే మీరు చాలా డబ్బు ఆదా చేస్తారు
నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ మాగ్నైట్ స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.12 లక్షలు. ఇది 71 bhp పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండో ఇంజిన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్, ఇది 99 bhp పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్
6 ఎయిర్‌బ్యాగులతో 360 డిగ్రీ కెమెరా కలిగిన ఈ కారు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(TPMS) తదితర ఫీచర్స్ కలిగి ఉంది. రన్నింగ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ ఎక్స్టర్ స్టార్టింగ్ ధర రూ.6.13 లక్షలు. ఇది 82 bhp పవర్, 113.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్
6 ఎయిర్‌బ్యాగులు, డాష్ కామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్(VSM), ABS, EBD, తదితర బెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ కారు స్టైలిష్ లుక్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.
సిట్రోన్ C3
సిట్రోన్ C3 స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.16 లక్షలు. ఇది 82 bhp పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండో టర్బో పెట్రోల్ ఇంజిన్ 109 bhp పవర్, 190 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్
6 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) తదితర ఫీచర్లు ఉన్నాయి. ఫ్రెంచ్ బ్రాండ్ డిజైన్, క్లాస్ లుక్ కావాలంటే సిట్రోన్ C3 బెస్ట్ ఆప్షన్.