MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • GST : నిర్మలకు షాకిచ్చిన కర్ణాటక రైస్ మిల్లర్లు, ఇకపై 26 కేజీల రైస్ బ్యాగులు, జీఎస్టీకి విరుగుడు మంత్రం ఇదేనా

GST : నిర్మలకు షాకిచ్చిన కర్ణాటక రైస్ మిల్లర్లు, ఇకపై 26 కేజీల రైస్ బ్యాగులు, జీఎస్టీకి విరుగుడు మంత్రం ఇదేనా

ఇటీవల, కేంద్ర ప్రభుత్వం 25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై 5% పన్ను విధించడం ప్రారంభించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి విరుగుడుగా కర్ణాటకలో రైస్ మిల్లర్లు వినూత్నమైన పద్ధతికి తెర లేపారు. ఇకపై తాము 25 కేజీల రైస్ బ్యాగ్ బదులు, 26 కేజీల రైస్ బ్యాగ్ లను మార్కెట్లో విక్రయిస్తామని, తద్వారా వినియోగ దారుడికి జీఎస్టీ నుంచి ఉపశమనం కల్పిస్తామని ప్రకటించారు. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Jul 24 2022, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జిఎస్‌టి విధించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను తిప్పికొట్టేందుకు రైస్‌మిల్లు యజమానులు కొత్త టెక్నిక్ మొదలు పెట్టారు 26 కేజీల రైస్ బ్యాగులను మార్కెట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా వినియోగదారులకు పన్ను లేకుండానే ఉత్పత్తులను అందజేసేలా ప్లాన్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై (బియ్యం, పప్పులు మొదలైనవి) 5% పన్ను విధించడం ప్రారంభించింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, కాబట్టి ఎలాంటి పన్నులు విధించవద్దని పలు వాణిజ్య, వర్తక సంఘాలు కోరాయి. అయితే ప్రభుత్వం తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులపై భారం పడకుండా తూకంలో మార్పులు చేసి ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ విక్రయించాలని రైస్ మిల్లు యజమానులు నిర్ణయించుకున్నారు

35

బియ్యం, పప్పులు, పాల ఉత్పత్తులపై పన్నుల వల్ల మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడనుంది. ఈ విషయమై కర్ణాటకలోని రైస్‌మిల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.శివకుమార్‌ మాట్లాడుతూ పన్ను లేకుండా ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించామని తెలిపారు.
 

45

25 కిలోలు, అంతకంటే తక్కువ బరువున్న ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై మాత్రమే జిఎస్‌టి విధించబడుతుంది. అయితే, ప్యాక్ చేయని ఉత్పత్తులపై GST లేదు. 25 కిలోలు బ్యాగుపైనే పన్ను చెల్లించాలని నిర్ణయించిన కేంద్రం తీరు చాలా అశాస్త్రీయమన్నారు. కాబట్టి 26 కిలోలు సంచుల్లో బియ్యం ప్యాక్ చేసి విక్రయించాలని యోచిస్తున్నట్లు పన్నుల శాఖ అధికారులకు సమాచారం అందించామని. అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. అందుకే బరువులో మార్పు చేస్తున్నట్లు వివరించారు.

55

తూకం ప్రకారం 25 కిలోల బియ్యం బస్తాపై మాత్రమే 5% పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి 25 కిలోల బస్తాలకు బదులు 26 కిలోల బస్తాల్లో మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

About the Author

KA
Krishna Adhitya
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Recommended image2
యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? అసలేం జరుగుతోంది.?
Recommended image3
Flipkart Big Billion Days 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ బిగ్ డీల్స్ వచ్చేశాయి.. ఈ బ్యాంకు కార్డులపై భారీ డిస్కౌంట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved