- Home
- Business
- RRR దెబ్బతో లాభాల్లోకి ఎగిసిన PVR, Inox షేర్లు...25 నెలల గరిష్ట స్థాయిని తాకిని మల్టీప్లెక్స్ షేర్లు
RRR దెబ్బతో లాభాల్లోకి ఎగిసిన PVR, Inox షేర్లు...25 నెలల గరిష్ట స్థాయిని తాకిని మల్టీప్లెక్స్ షేర్లు
ప్రపంచ వ్యాప్తంగా రిలీజై అఖండ విజయం సాధించిన RRR సినిమా ప్రభావం అటు స్టాక్ మార్కెట్లో కూడా ప్రతిబింబించంది. శుక్రవారం మల్టీప్లెక్స్ కంపెనీల షేర్లు జంప్ కావడానికి కారణం భారీ బడ్జెట్ చిత్రం RRR అని భావిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. దీంతో థియేటర్లలో బుకింగ్స్ భారీగా చోటు చేసుకున్నాయి. రేపటి నుంచి వరుసగా రెండు రోజుల పాటు వీకెండ్ సెలవలు ఉండటంతో థియేటర్స్ అన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్నాయి.
RRR విజయంతో అటు కరోనా కాలంలో నష్టాలు మూటగట్టుకున్న మల్టీప్లెక్స్ కంపెనీల షేర్లు తిరిగి ర్యాలీని అందుకున్నాయి. శుక్రవారం PVR, Inox leisure షేర్లలో జంప్ కనిపించింది. దీంతో వాటి షేర్ విలువ ఏకంగా 25 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. శుక్రవారం ఈ స్టాక్స్ జంప్ చేయడానికి కారణం భారీ బడ్జెట్ చిత్రం RRR అని భావిస్తున్నారు. శుక్రవారం ఐనాక్స్ స్టాక్ 479కి చేరుకుంది. పీవీఆర్ షేర్లు రూ.1,839కి చేరాయి.
భారీ బడ్జెట్ సినిమాలు
మార్చి 7 నుండి PVR స్టాక్ దాదాపు 22 శాతం లాభపడింది. ఈ ఏడాది ఇప్పటివరకు 41 శాతం పెరిగింది. గత కొంతకాలంగా మల్టీప్లెక్స్ కంపెనీల షేర్లపై పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి కారణం ఇటీవల వచ్చిన పలు భారీ చిత్రాలే. వీటిలో అఖండ, పుష్ప, భీమ్లానాయక్, కాశ్మీర్ ఫైల్స్, బచ్చన్ పాండే ప్రస్తుతం RRR లాంటి సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త రికార్డులను సృష్టించాయి.
2020 మార్చిలో కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత, ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ఈ ప్రభావం ఎక్కువగా చూపిన పరిశ్రమల్లో, మల్టీప్లెక్స్ పరిశ్రమ కూడా ఉంది. కానీ, ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్లీ సినిమా చూడ్డానికి జనాలు వెళ్లడం మొదలుపెట్టారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని రూ.300 కోట్లతో నిర్మించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పీరియాడికల్ డ్రామాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ కూడా నటిస్తోంది. విభిన్నమైన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ దేవగణ్ ఇందులో కూడా పనిచేశాడు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మరో వారం రోజుల పాటు మంచి ప్రదర్శన కనబరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక భవిష్యత్తులో మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలు సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందు ముందు హీరో పంతీ 2, జెర్సీ, మహేష్ బాబు సర్కారు వారి పాట, విజయ్ నటించిన బీస్ట్, విజయ్ దేవరకొండ లైగర్ లాంటి చిత్రాలు పాన్ ఇండియాలో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మల్టీ ప్లెక్స్ లకు మళ్లీ పాత కళ వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.