Phone Security: ఈ చిన్న సెట్టింగ్‌తో దొంగల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోవచ్చు
Phone Security: దొంగలు ఫోన్ కొట్టేసినప్పుడు వెంటనే ఏం చేస్తారు? స్విచ్ ఆఫ్ చేస్తారు కదా.. ఇలా చేస్తే మీ ఫోన్ కొట్టేసిన దొంగలు అస్సలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేరు. దీంతో వెంటనే ఫోన్ సిగ్నల్స్ ద్వారా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటో తెలుసుకుందాం రండి.

సెల్ ఫోన్ దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దొంగిలించిన ఫోన్లన్నీ బ్లాక్ మార్కెట్లో మళ్ళీ జనాల చేతుల్లోకే వచ్చేస్తున్నాయి. రూ.70 వేలు, రూ.80 వేలు విలువ చేసే ఐఫోన్, సాంసంగ్ తదితర బ్రాండెడ్ ఫోన్లను కూడా కొట్టేసి దొంగ బజారులో రూ.10,000 కంటే తక్కువకే అమ్మేస్తున్నారు.
సెల్ ఫోన్లలో సరైన సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేసుకోకపోవడం దొంగలకు బాగా ఉపయోగపడుతోంది. అందుకే సెల్ ఫోన్ దొంగతనం చేసిన వెంటనే అందులో ఉండే డేటా మొత్తాన్ని తీసేసుకుంటున్నారు.
సాధారణంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటే పవర్ బటన్ నొక్కితే సరిపోతుంది. కానీ స్విచ్ ఆఫ్ చేయాలన్నా పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తే.. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే దొంగలు మీ ఫోన్ దొంగిలించినా స్విచ్ ఆఫ్ చేయలేరు.
ఇలాంటి అద్భుతమైన ఆప్షన్ మీ ఫోన్లోనే ఉంది. దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫోన్లో సెట్టింగ్స్(settings) ఓపెన్ చేయండి.
అందులో గూగుల్(google) పై క్లిక్ చేయండి.
ఆల్ సర్వీసెస్(All services) సెలెక్ట్ చేసి, థెఫ్ట్ ప్రొడక్షన్(Theft protection) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అక్కడ కనిపించే రెండు ఆప్షన్స్ ని ఆన్ లో ఉంచుకోండి.
అందులో ఒక ఆప్షన్ ఏంటంటే.. ఫోను పట్టుకుని పరిగెడుతుంటే ఆటోమేటిక్ గా స్క్రీన్ లాక్(Screen lock) అయిపోతుంది.
రెండోది.. మీరు ఆఫ్ లైన్ లోకి వెళ్ళగానే ఫోన్ లాక్ అయిపోతుంది.
సెట్టింగ్స్(settings) లో సెర్చ్(search) ఆప్షన్ లో అన్ లాక్ టు పవర్ ఆఫ్(unlock to power off) అని టైప్ చేసి సెర్చ్ చేయండి.
మీకు కనిపించిన ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే పవర్ ఆఫ్ చేయాలన్న పాస్వర్డ్ అడుగుతుంది. దీంతో దొంగలు మీ ఫోన్ ను దొంగిలించినా పవర్ ఆఫ్ చేయలేరు. వెంటనే ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేయగలిగితే మీ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చు.