Prepaid vs Postpaid: స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే పోస్ట్‌పెయిడ్ కి మారిపోండి. ఎందుకంటే..
Prepaid vs Postpaid: పోస్ట్ పెయిడ్ కి మారండి అంటూ ఈ మధ్య మీకు కాల్స్ వస్తున్నాయా? పోస్ట్ పెయిడ్ కి మారితే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయని మీ నెట్వర్క్ ప్రొవైడర్లు మీకు మెసేజ్ లు, కాల్స్ చేసి చెబుతున్నారా? ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మధ్య తేడాలు, ఏది ఎక్కువ స్పీడ్ సిగ్నల్స్ ఇస్తుందో తెలుసుకుందాం.

ఈ రెండు కనెక్షన్లలో స్పీడ్ పరంగా భారీ తేడా అయితే ఉండదు. ఎందుకంటే ఒకే నెట్‌వర్క్‌లో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఒకే టవర్లు, ఒకే నెట్‌వర్క్ బ్యాండ్‌విడ్త్ ఉంటుంది. కానీ ఇందులో ఒక బిజినెస్ కోణం ఉంది. అందుకే టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ లోకి మారండి అంటూ అడుగుతుంటారు. ఆ బిజినెస్ బెనిఫిట్ ఏంటో తెలుసుకుందాం.
పోస్ట్ పెయిడ్ వాళ్లకి డేటా స్పీడ్ ఎక్కువ
పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు కొన్ని కంపెనీలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తాయి. కష్టమర్ల విశ్వాసం నిలుపుకోవడానికి, హై ప్రైయారిటీ నెట్‌వర్క్ యాక్సెస్ ఇస్తారు. ఆ నెట్వర్క్ లో ప్రీపెయిడ్ కస్టమర్ల కంటే పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఇంటర్నెట్ వేగంగా ఉంటుంది.
దీని వెనుక ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. అదేంటంటే.. ప్రీపెయిడ్ కస్టమర్లు అయితే ముందుగానే వారికి అవసరమైన డేటా ప్లాన్ తీసుకొని డబ్బు చెల్లిస్తారు. అదే పోస్ట్ పెయిడ్ కస్టమర్లు అయితే నెలాఖరులో బిల్లు చెల్లిస్తారు. డేటా స్పీడ్ గా ఉంటే ఎక్కువ డేటా వాడతారు. దీంతో బిల్లు కూడా ఎక్కువ కడతారు. అందుకే పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఇంటర్నెట్ స్పీడ్ గా ఉంటుంది.
ప్రీపెయిడ్ వినియోగదారుల విషయానికొస్తే దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రీపెయిడ్ కనెక్షన్ ఉపయోగిస్తారు. దీంతో నెట్‌వర్క్ లోడ్ పెరిగినప్పుడు ఆటోమెటిక్ గా స్పీడ్ తగ్గుతుంది. అందుకే టెలికాం కంపెనీలు వినియోగదారులకు ఫోన్లు, మెసేజ్ లు చేసి పోస్ట్ పెయిడ్ లోకి మారండి. అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు అని చెబుతుంటారు.
పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు స్టేబుల్ గా ఉంటాయి. ప్రత్యేకంగా ప్రీమియం ప్లాన్లు ఉపయోగిస్తే బెటర్ స్పీడ్, ప్రాధాన్యం లభించవచ్చు. ప్రీపెయిడ్ లో డేటా యూజ్ ఎక్కువగా ఉన్నప్పుడు తర్వాత స్పీడ్ తక్కువ అయ్యే అవకాశం ఉంది.
మీరు స్టేబుల్ కనెక్షన్, మంచి స్పీడ్, ప్రత్యేక ప్రాధాన్యం కోరుకుంటే పోస్ట్‌పెయిడ్ బెటర్. మీరు తక్కువ ఖర్చులో లిమిటెడ్ గా ఇంటర్నెట్ వాడాలనుకుంటే ప్రీపెయిడ్ సరిపోతుంది.