రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షలు.. రావాలంటే ఏం చేయాలి?
Post Office Scheme : పోస్టాఫీసులో నెలకు రూ. 12,500 పెట్టుబడి పెట్టండి. రూ. 40 లక్షలకు పైగా సంపాదించండి ఎలా అంత మొత్తం సంపాదించవచ్చు. ఇంతకీ ఆ పథకమేంటీ?

సురక్షితమైన, లాభదాయక పథకం ఇదే..
చాలా మంది తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయాలని భావిస్తారు. అయితే.. ఆ పొదుపు సురక్షితమైన పెట్టుబడిగా, మంచి రాబడిని వనరుగా ఉంటే బాగుంటుందని భావిస్తారు. అలాంటి వారికి పోస్టాఫీసు పథకాలే బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రభుత్వం గ్యారెంటీతో పాటు మంచి రాబడిని పొందవచ్చు.
అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో మనం పెట్టిన పెట్టుబడికి గ్యారెంటీ పాటు పన్నురహిత ఆదాయాన్ని పొందవచ్చు. PPFలో పెట్టుబడి ద్వారా 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ పొందవచ్చు. అలాగే, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల భారీ మొత్తం ఆదాయం పొందవచ్చు.
వడ్డీ ఎంత? పాలసీ గడువు?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కింద పెట్టుబడి పెట్టినవారికి కేంద్ర ప్రభుత్వం 7.1% వడ్డీని అందుకోవచ్చు. అది కూడా పన్నులేకుండా. ముఖ్యంగా ఈ పథకం అధిక పన్ను పరిధిలో ఉన్న వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుంది. PPFలో పెట్టుబడి 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందుతుంది. ఈ పథకం క్రమశిక్షణతో పొదుపు చేయడానికి ప్రోత్సహిస్తుంది.
PPFపథకం EEE (Exempt-Exempt-Exempt)విధానంతో పని చేస్తుంది. అంటే, ఇందులోని పెట్టుబడికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్టుబడిపై వచ్చే వడ్డీపై కూడా పన్ను విధించబడదు, ఈ పథకం గడువు 15 సంవత్సరాలు. అయితే ఆ 15 సంవత్సరాల తర్వాత కూడా పెట్టుబడిని ప్రతి 5 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు.
కేవలం రూ. 500తో పథకం ప్రారంభం
పోస్ట్ ఆఫీస్ PPFపథకంలో పెట్టుబడికి భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్స్ గ్యారెంటీ గల ఈ పథకాన్ని కేవలం రూ. 500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఈ పథకంలో సంవత్సరంలో గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ముగిసిన తర్వాత కూడా, మీరు ఈ పెట్టుబడిని మరో 5 ఏండ్లు పొడిగించుకోవచ్చు, తద్వారా పొడిగింపు అయినా వ్యవధిలో కూడా సురక్షితంగా పొదుపు కొనసాగించవచ్చు.
రూ.40 లక్షలు పొందాలంటే?
PPF పథకం ద్వారా 15 సంవత్సరాల మెచ్యూరిటీతో రూ.40 లక్షల కంటే ఎక్కువ రిట్నర్స్ పొందవచ్చు. ఎలాగంటే.. 15 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే.. మొత్తం డిపాజిట్ రూ.22,50,000 అవుతుంది.
దీనికి 7.1% వార్షిక వడ్డీ కలిపితే.. రూ.18,18,209 రాబడి లభిస్తుంది. మెచ్యూరిటీ సమయం వరకు రూ.40,68,209 పొందవచ్చు. మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిని బట్టి, ఈ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
లోన్ తోపాటు ముందస్తు విత్ డ్రా..
PPF పథకం కింద ఖాతాను ఏదైనా పోస్టాఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకులో తెరవవచ్చు. ఈ ఖాతా పెట్టుబడిపై రుణ సౌకర్యం కూడా అందిస్తుంది. ప్రారంభ పెట్టుబడి పెట్టిన ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు.
అదేవిధంగా PPF ఖాతా ఐదు సంవత్సరాల తరువాత ముందస్తు ఉపసంహరణ (Partial Withdrawal) సౌకర్యాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, మీరు 2020-21లో ఖాతాను తెరిచినట్లయితే, 2026-27 తర్వాత ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చు.