MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Post Office: కేవలం రూ. 200 కడితే.. రూ. 10 లక్షలు గ్యారెంటీ.. పోస్టాఫీస్ బంపర్ స్కీం..

Post Office: కేవలం రూ. 200 కడితే.. రూ. 10 లక్షలు గ్యారెంటీ.. పోస్టాఫీస్ బంపర్ స్కీం..

Post Office: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఒక వరం. రోజుకు రూ. 200 ఆదా చేస్తూ, పదేళ్లలో రూ. 10 లక్షలు సంపాదించవచ్చు. ఈ పథకం 6.7 శాతం వడ్డీని అందిస్తూ, బ్యాంకుల కంటే ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. 

2 Min read
Author : Pavithra D
Published : Feb 02 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం
Image Credit : Post Office\Twitter

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఆర్థిక భద్రతను అందిస్తూ పదేళ్లలో రూ. 10 లక్షల వరకు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో, ముఖ్యంగా షేర్ మార్కెట్ లాంటి రిస్క్‌తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండాలనుకునే వారికి, పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ఒక సురక్షితమైన, స్థిరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

25
రోజుకు రూ. 200 చొప్పున ఆదా
Image Credit : Getty

రోజుకు రూ. 200 చొప్పున ఆదా

ఈ పథకం ప్రకారం, రోజుకు రూ. 200 చొప్పున ఆదా చేస్తూ పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేయగలిగితే, పదేళ్ల తర్వాత రూ. 10 లక్షలకు పైగా పొందవచ్చు. రోజుకు రూ. 200 అంటే నెలకు రూ. 6 వేలు, సంవత్సరానికి రూ. 72 వేలు అవుతుంది. ఐదేళ్ల పాటు ఈ విధంగా డిపాజిట్ చేసినట్లయితే, సుమారు రూ. 4.28 లక్షలు అవుతుంది. ఈ మొత్తాన్ని ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండా మరో ఐదేళ్లకు పొడిగిస్తే, పదేళ్ల మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 10.25 లక్షలు అందుతుంది. ఈ పథకం సుమారు 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. దీనికి ప్రతి మూడు నెలలకు ఒకసారి చక్రవడ్డీ వస్తుంది.

Related Articles

Related image1
బిర్యానీతో బంపర్ బిజినెస్.. ఏకంగా నెలకు రూ. 1.35 లక్షల సంపాదన.. ఎలాగంటే.?
Related image2
ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి కోటీశ్వరుడిగా మారొచ్చు..! కానీ.. ఈ 5 తప్పులు చచ్చినా చేయకూడదు
35
పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు..
Image Credit : Social Media

పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు..

పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు బ్యాంకుల కంటే ఎంతో సురక్షితమైనవి. బ్యాంకుల్లో ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే, ఒక బ్యాంకు నష్టపోయినా లేదా దివాళా తీసినా, మీరు ఐదు లక్షల రూపాయలకు మించి ఎంత డిపాజిట్ చేసినా, మీకు తిరిగి వచ్చేది గరిష్టంగా ఐదు లక్షలు మాత్రమే. కానీ పోస్ట్ ఆఫీసుల్లో, మీ డబ్బు ఎంత పెద్ద మొత్తమైనా సరే, ప్రభుత్వ హామీతో పూర్తి భద్రతతో ఉంటుంది. ఇది సామాన్యులు, మధ్య తరగతి వారికి మంచి ప్రయోజనం.

45
 రికరింగ్ డిపాజిట్ ఖాతాను..
Image Credit : Post Office\Twitter

రికరింగ్ డిపాజిట్ ఖాతాను..

ఈ రికరింగ్ డిపాజిట్ ఖాతాను కేవలం రూ. 100తో తెరవవచ్చు. బ్యాంకు ఖాతాల్లో మాదిరిగా రూ. 5 వేలు లేదా రూ. 10 వేల కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. కేవలం రూ. 1 కనీస బ్యాలెన్స్ ఉంచితే సరిపోతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, తక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి రోజు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ ఖాతా నుంచి రోజువారీ రూ. 200 ఆటోమేటిక్‌గా పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతాకు వెళ్లేలా ఆన్‌లైన్ సిస్టమ్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. మీ బ్యాంకులో కనీసం రూ. 200 ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.

55
డిపాజిట్‌ను రద్దు చేసుకునే అవకాశం
Image Credit : Post Office\Twitter

డిపాజిట్‌ను రద్దు చేసుకునే అవకాశం

ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, మూడేళ్ల తర్వాత ఈ డిపాజిట్‌ను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలా రద్దు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు తగ్గుతాయి కానీ, అప్పటివరకు జమ అయిన వడ్డీతో సహా మీ డబ్బు సురక్షితంగా మీకు తిరిగి అందుతుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
House Buy: నెలకు రూ.80 వేల శాలరీతో రూ. 50 లక్షల ఇల్లు కొనడం సాధ్యమేనా.? ఈఎంఐ ఎంత ఉండాలి
Recommended image2
కేవలం రూ. 10 వేలతో 5 ఏళ్లలో లక్షల్లో రాబడి.. SIP ఎలా ప్లాన్ చేసుకోవాలంటే..
Recommended image3
Multibagger Stocks: రూ. లక్షతో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బుకు డబుల్ ప్రాఫిట్ పక్కా.!
Related Stories
Recommended image1
బిర్యానీతో బంపర్ బిజినెస్.. ఏకంగా నెలకు రూ. 1.35 లక్షల సంపాదన.. ఎలాగంటే.?
Recommended image2
ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి కోటీశ్వరుడిగా మారొచ్చు..! కానీ.. ఈ 5 తప్పులు చచ్చినా చేయకూడదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved