బిర్యానీతో బంపర్ బిజినెస్.. ఏకంగా నెలకు రూ. 1.35 లక్షల సంపాదన.. ఎలాగంటే.?
Biryani Business: బిర్యానీ వ్యాపారం ఓ మంచి బిజినెస్ ఆప్షన్. రోజుకు 50 ప్లేట్లు అమ్మడం ద్వారా నెలకు రూ. 1.35 లక్షలు సంపాదించవచ్చు. మొత్తం ఖర్చులు రూ. 80 వేలు పోనూ.. నికర లాభం నెలకు రూ. 55 వేలు ఉంటుంది.

బిజినెస్ ఏదైనా కూడా..
బిజినెస్ ఏదైనా కూడా మనం కష్టపడకపోతే రూపాయ్ రాదు. ఫుడ్‌ను బాగా తినేవారు అదే ఫుడ్ ద్వారా మంచిగా సంపాదించవచ్చు. తక్కువ పెట్టుబడి.. అధిక రాబడి.. మార్కెటింగ్, అలాగే స్థానికంగా కాంటాక్ట్స్ పెంచుకోవడం.. అలాగే క్యాటరింగ్ లాంటివి కూడా చేస్తే.. మీ చేతికి డబ్బే డబ్బు.
బిర్యానీ బిజినెస్..
బిర్యానీ బిజినెస్.. దేశంలో.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాపారానికి బాగా క్రేజ్ ఉంది. లాభదాయకమైన వ్యాపారంగా గుర్తింపు పొందింది. ఈ బిజినెస్‌లో ఎలా లాభాలు ఆర్జించవచ్చో ఓ అంచనా వేసేద్దాం పదండి.!
ఒక ప్లేట్ బిర్యానీ..
ఒక ప్లేట్ బిర్యానీ ధర రూ. 90గా నిర్ణయించినట్లయితే.. రోజుకు సుమారు 50 ప్లేట్లు అమ్మడం ద్వారా రూ. 4.5 వేలు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ లెక్కన, నెలవారీ మొత్తం సంపాదన రూ. 1.35లక్షలుగా ఉంటుంది. అయితే, ప్రతి వ్యాపారంలో ఖర్చులు ఉంటాయి. బిర్యానీ వ్యాపారానికి సంబంధించి ఆహార పదార్థాలు, రూమ్ లేదా షాప్ అద్దె, సిబ్బంది జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి నెలకు సుమారు రూ. 80 వేలు ఖర్చవుతాయి అని అంచనా వేద్దాం.
నెలవారీ సంపాదన నుంచి..
మొత్తం నెలవారీ సంపాదన నుంచి ఖర్చులను తీసివేస్తే.. యజమానికి నెలకు రూ. 55 వేలు నికర లాభం మిగులుతుంది. ఈ లాభాన్ని సంవత్సరానికి లెక్కిస్తే ఇది రూ. 6.60 లక్షలకు చేరుకుంటుంది. ఈ అద్భుతమైన రాబడికి మన కృషి, నిబద్ధత అవసరం. కష్టపడి పని చేస్తేనే బిర్యానీ వ్యాపారంలో గణనీయమైన లాభాలు సాధించవచ్చు.
ఫుడ్ యాప్స్‌తో కూడా..
ఒక్క ప్రాంతంలోనే ఈ బిజినెస్ నడపకుండా.. క్యాటరింగ్ అలాగే స్థానిక కాంటాక్టులు మనం సంపాదిస్తే.. ఈజీగా మన బిజినెస్ వృద్ది చెందుతుంది. అలాగే పార్టీలు, ఫంక్షన్‌లు లాంటి వాటికి సప్లై చేయవచ్చు. ఫుడ్ యాప్స్‌తో కూడా కనెక్ట్ అయితే.. మనకు ఇంకా లాభాలు వస్తాయి.

