MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.100 పొదుపు చేస్తూ రూ.లక్షలు సంపాదించాలని ఉందా? ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయండి

రూ.100 పొదుపు చేస్తూ రూ.లక్షలు సంపాదించాలని ఉందా? ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయండి

భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలని చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికోసం వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరికొందరు సెక్యూర్ గా ఉండాలని కొన్ని చోట్ల మాత్రమే పెట్టుబడి పెడుతుంటారు. అలా మీకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఒక చక్కటి స్కీమ్ అందిస్తోంది. ఇందులో రోజుకు రూ.100 పెట్టుబడి పెడితే లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు. ఈ పథకం గురించి వివరంగా చూద్దాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 04 2024, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సురక్షితమైన పెట్టుబడి కోరుకునే వారికి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ వివిధ పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం కాబట్టి పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు చాలా సురక్షితమైనవి. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి ఎటువంటి మోసాలకు గురికాకుండా ఉంటుంది. మీరు తక్కువ కాలంలో రూ.లక్షలు సంపాదించాలనుకుంటే పోస్టాఫీసులో RD స్కీమ్ లో పెట్టుబడి పెట్టండి. తక్కువ పెట్టుబడితో 5 సంవత్సరాల్లో లక్షల రూపాయలను దాచుకోవచ్చు. ఇలాంటి చిన్న పొదుపులు భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

25

ఎంత పెట్టుబడి పెట్టాలి?

రోజుకు 100 రూపాయలు ఆదా చేసి పోస్ట్ ఆఫీస్ RD పథకంలో పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత మంచి లాభం పొందవచ్చు. RD పథకంలో పెట్టుబడి పెడితే రోజుకు రూ.100 అంటే నెలకు రూ.3000 పొదుపు చేయవచ్చు. ఇలా 5 సంవత్సరాల తర్వాత మీరు లక్షల రూపాయలు ఆదా చేయవచ్చు.

 

35

వడ్డీ రేటు ఎంత ఉంటుంది?

పోస్ట్ ఆఫీస్ RD 6.7 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. దీనితో పాటు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టే వెసులుబాటు కూడా ఉంది. మీకు కావలసినంత గరిష్టంగా పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు రూ.3000 అంటే రోజుకు రూ.100 పెట్టుబడి పెడితే ఈ 5 సంవత్సరాల్లో రూ.1,80,000 ఆదా అవుతుంది. దీనికి 6.7 శాతం వడ్డీ రేటు ప్రకారం దాదాపు మొత్తం రూ.2,14,097 మీ చేతికి వస్తుంది. 

45

దాదాపు అన్ని పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రజలకు సురక్షితమైన పెట్టుబడులు పెట్టడానికి అనుమతిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ పథకాల్లో వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే వెసులుబాటు కూడా ఉంది. RD పథకంలో లోన్ సౌకర్యం కూడా ఉంది. డిపాజిట్‌లో 50 శాతం వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. దీనితో పాటు 5 సంవత్సరాల తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగించాలనుకుంటే మెచ్యూరిటీ తర్వాత కూడా 5 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. 

 

55

పోస్ట్ ఆఫీస్‌లో RD ఖాతా తెరవడం కూడా చాలా సింపుల్. దేశంలోని ఏ పౌరుడైనా RD పథకంలో ఖాతా తెరవవచ్చు. సమీపంలోని పోస్ట్ ఆఫీసుల్లో నెలకు రూ.100 నుంచి రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచే వెసులుబాటు ఉంది. జాయింట్ లేదా సింగిల్ అకౌంట్ తెరిచే వెసులుబాటు ఉంది. దీనికి ఆధార్ కార్డు, ఫోటో, పాన్ కార్డు, ఇతర సాధారణ డాక్యుమెంట్లు అవసరం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇప్పటికే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved