Post Office: పోస్టాఫీసులో డబ్బులు దాచుకుంటున్నారా..అయితే సెప్టెంబర్ 30లోగా ఈ పనిచేయకపోతే భారీ నష్టం తప్పదు..
పోస్ట్ ఆఫీస్ పథకాల్లో మీరు డబ్బులను పొదుపు చేస్తున్నారా అయితే సెప్టెంబర్ 30లోగా ఒక ముఖ్యమైన పని చేయకపోతే మీ అకౌంట్ డియాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నెలాఖరులోగా పోస్ట్ ఆఫీస్ వెళ్లి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ సహా చిన్న పొదుపు పథకాల ఖాతాలకు ఆధార్‌ను లింక్ చేయడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఈ తేదీలోగా ఆధార్‌ను లింక్ చేయకపోతే, చిన్న పొదుపు పథకం ఖాతాలు డీయాక్టివేట్ అవుతుంది. దీనికి సంబంధించి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 31, 2023 నాటి సర్క్యులర్‌ను విడుదల చేసింది.
పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ సహా చిన్న పొదుపు పథకాల ఖాతాలను తెరవడానికి ఆధార్ నంబర్ తప్పనిసరి అని సర్క్యులర్ పేర్కొంది. అలాగే ఇప్పటికే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు తమ ఆధార్ నంబర్ ఇవ్వాలని కోరింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలలో ఇప్పటికే ఖాతాలు కలిగి ఉండి, ఆధార్ నంబర్‌ను అందించడంలో విఫలమైన వారిని అక్టోబర్ 1, 2023 నుండి స్తంభింపజేస్తామని సర్క్యులర్‌లో పేర్కొంది.
ఆధార్‌ను లింక్ చేయకపోతే,
పోస్టాఫీసులు, బ్యాంకుల్లోని ఇన్‌యాక్టివ్ PPF, NSC, కిసాన్ వికాస్ పత్ర, SCSS, స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలకు ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి. స్మాల్ సేవింగ్స్ యోజన ఖాతాను తెరిచేటప్పుడు ఆధార్ నంబర్‌ను సమర్పించని వారు సెప్టెంబర్ 30, 2023లోపు ఆధార్ నంబర్‌ను సమర్పించాలి. ఆధార్ నంబర్ అందుబాటులో లేకుంటే, ఆధార్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కూడా అందించవచ్చు. ఆధార్ నంబర్‌ను అందించడంలో విఫలమైన వారి ఖాతాలను అక్టోబర్ 1, 2023 నుండి స్తంభింపజేస్తామని సర్క్యులర్‌లో పేర్కొంది.
Post Office Scheme
మీరు ఆధార్ నంబర్ లేకుండా ఏదైనా స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను తెరవాలనుకుంటే, ఖాతా తెరిచిన ఆరు నెలల్లోపు ఆధార్ నంబర్‌ను సమర్పించాలి. ఆరు నెలల తర్వాత కూడా ఆధార్ నంబర్ సమర్పించకపోతే వారి ఖాతా డీయాక్టివేట్ అవుతుంది.
స్మాల్ సేవింగ్స్ యోజన ఖాతా డీయాక్టివేట్ అయితే ఏమి జరుగుతుంది?
సెప్టెంబరు 30లోగా మీరు ఆధార్ నంబర్‌ను సంబంధిత పోస్టాఫీసు లేదా బ్యాంకుకు సమర్పించకపోతే PPF, NSC లేదా SCSSతో సహా చిన్న పొదుపు ఖాతాలు డీయాక్టివేట్ అవుతుంది. మీ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. మీరు చిన్న పొదుపు పథకాలకు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలను పొందలేరు. అలాగే, ఈ పొదుపు పథకాలపై రుణాలు తీసుకోవడం, విత్ డ్రాయల్ సాధ్యం కాదు. బాకీ ఉన్న వడ్డీ కూడా మీ బ్యాంకు ఖాతాలో జమ అవదు. చిన్న మొత్తపు పొదుపు పథకం మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత కూడా డబ్బును ఉపసంహరించుకోలేరు.
ఆధార్‌ని ఎలా లింక్ చేయాలి ?
చిన్న పొదుపు ఖాతాలకు ఆధార్ నంబర్‌ను లింక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వినియోగదారులు సంబంధిత బ్యాంకు లేదా పోస్టాఫీసును సందర్శించడం ద్వారా ఆధార్‌ను లింక్ చేయవచ్చు. మరికొన్ని బ్యాంకులు ఆధార్ , ఖాతాలను ఆన్‌లైన్‌లో లింక్ చేయడానికి అనుమతిస్తాయి