చిన్న వ్యాపారం చేయాలంటే రూ.50,000 లోన్, ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు
కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారులకు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రూ.50,000 వరకు లోన్ ఇస్తోంది. ఇందుకోసం ఎవరు అర్హులు? ఎలా లోన్ పొందాలి? అనే వివరాలను తీసుకోవాలి.

డాక్యమెంట్లు లేకుండా కేంద్ర ప్రభుత్వం లోన్
కేంద్ర ప్రభుత్వం మహిళలు, రైతులు, యువత కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. మహిళలకు, రైతులకు తక్కువ వడ్డీకి లోన్లు అందించి వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2020లో కరోనా వల్ల ఎంతోమంది ఆర్ధికంగా చితికి పోయారు. ఎన్నో వీధి దుకాణాలు, వ్యాపారాలు మూతపడిపోయాయి. అందుకే వారికి ఆర్థిక సాయం అందించేందుకు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ PM స్వానిధి పథకాన్ని ప్రారంభించింది.
చిన్న వ్యాపారులకు తక్కువ వడ్డీతో
ఈ పథకం ద్వారా వ్యాపారులకు తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది. ఇదొక మైక్రో క్రెడిట్ పథకం. ఈ పథకం వల్ల వీధి వ్యాపారులకు, చిన్న దుకాణదారులకు తక్కువ వడ్డీకి ముప్పై వేల రూపాయలు అందిస్తారు. కానీ ఈ రూ. 30,000 ఒకేసారి చేతికి అందించరు. మొదటి విడతగా రూ.15,000 అందిస్తారు. దాన్ని మీరు తిరిగి చెల్లించాలి. రెండో విడతగా రూ.25,000 అందిస్తారు. దాన్ని తిరిగి చెల్లించేయాలి. అప్పుడు మూడో విడతగా రూ.50,000 వరకు లోన్ అందుకునే అవకాశం ఉంది.
సకాలంలో లోన్ చెల్లిస్తేనే
ఇలా విడతల వారీగా లోన్ ఇవ్వడం వల్ల చిన్న వ్యాపారులు తీసుకున్న లోన్‌ను తిరిగి చెల్లించగలరు. సకాలంలో లోన్ తిరిగి చెల్లించే వారికి ఈ రుణం అందిస్తుంది. సకాలంలో చెల్లించే వారికి ప్రోత్సాహకంగా ఏడాదికి రూ.1,200 సబ్సిడీ కూడా వస్తుంది. PM స్వానిధి పథకం పనితీరును మెరుగుపరిచేందుకు UPIతో అనుసంధానించిన క్రెడిట్ కార్డులను కూడా త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఎవరు అర్హులు?
2020 మార్చి 24కి ముందు పట్టణాల్లో వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులు, ఇతర చిన్న వ్యాపారులు PM SVANidhi పథకం కింద లోన్ పొందవచ్చు. ఈ లోన్‌ను బ్యాంకులు అందిస్తాయి. అర్హులైన వ్యాపారులు ఆధార్ కార్డు, ఓటరు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ఐడెంటిటీ కార్డును సంబంధిత బ్యాంకులకు సమర్పించి లోన్లు తీసుకోవచ్చు.