- Home
- Business
- కేవలం 50 పైసలతోనే హోమ్ ఇన్సూరెన్స్.. రూ.10 లక్షల నుంచి రూ. 12.5 కోట్ల వరకు కవరేజ్.. ఎలా పొందాలంటే?
కేవలం 50 పైసలతోనే హోమ్ ఇన్సూరెన్స్.. రూ.10 లక్షల నుంచి రూ. 12.5 కోట్ల వరకు కవరేజ్.. ఎలా పొందాలంటే?
PhonePe home insurance: ఫోన్‌పే కొత్తగా హోమ్ ఇన్సూరెన్స్ ప్రారంభించింది. అగ్ని, వరద, భూకంపం సహా 20 రిస్క్‌లు కవర్ చేస్తుంది. కేవలం రూ. 181ల వార్షిక ప్రీమియం పొందవచ్చు. అంటే.. రోజుకు 50 పైసలు మాత్రమే.

ఫోన్ పే హోమ్ ఇన్సూరెన్స్
PhonePe home insurance: డిజిటల్ పేమెంట్స్‌లో అగ్రగామి ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) మరోసారి సంచలనం సృష్టించింది. ఇప్పుడు గృహ యజమానుల కోసం ప్రత్యేక హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాలసీ ద్వారా ఇంటి భద్రతతో పాటు విలువైన వస్తువులు కూడా రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా అగ్ని, వరదలు, భూకంపాలు, దొంగతనం సహా దాదాపు 20 రకాల రిస్క్‌లు కవరేజ్‌లో ఉంటాయి. ప్లాన్ ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించారు.
కేవలం 50 పైసలతో ఇంటి బీమా..
డిజిటల్ చెల్లింపు యాప్ PhonePe వినియోగదారుల కోసం కొత్తగా హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ప్రకటించింది. రోజుకు కేవలం 50 పైసలు (వార్షికంగా ₹181) చెల్లిస్తే చాలు, కవరేజ్ ₹10 లక్షల నుంచి ₹12.5 కోట్ల వరకు పొందొచ్చు. జీఎస్‌టి కూడా ప్రీమియంలో చేర్చబడటంతో, వినియోగదారులకు రోజుకు కేవలం 50 పైసల ఖర్చుతో ఈ సౌకర్యం పొందవచ్చు. ఈ బీమా పథకం ద్వారా అగ్ని, వరదలు, భూకంపం, అల్లర్లు, దొంగతనం వంటి 20 రకాల ప్రమాదాలను కవరేజ్ చేస్తుంది.
దీంతో, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు లేదా ఇతర అనుకోని ప్రమాదాల నుంచి కేవలం ఇల్లు మాత్రమే కాకుండా, ఫర్నిచర్, గృహోపకరణాలు, ఇతర విలువైన వస్తువులు కూడా బీమా పొందవచ్చు.
హోమ్ ఇన్సూరెన్స్ లో ప్రధాన ఆకర్షణ అదే..
ఫిన్‌టెక్ సంస్థ PhonePe విడుదల చేసిన కొత్త హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను చాలా సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా, ఇప్పటికే హౌసింగ్ లోన్ ఉన్న ఇంటి యజమానులు కూడా ఈ బీమాను పొందగలగడం దీని ప్రధాన ఆకర్షణ. సాధారణంగా హౌసింగ్ లోన్ ఇచ్చే బ్యాంకులు హోమ్ ఇన్సూరెన్స్ ను కవర్ చేస్తాయి.
అయితే PhonePe అందిస్తున్న ఈ ప్లాన్ అన్ని బ్యాంకుల గృహ రుణాలకు అనుగుణంగా ఉండడం విశేషం. ఈ బీమా పూర్తిగా డిజిటల్ విధానంలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేకుండా, ఆస్తి తనిఖీ (inspection) అవసరం లేకుండానే ఈ ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు.
PhonePe టార్గెట్ అదే..
PhonePe ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 64 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు, 45 కోట్లకు పైగా వ్యాపారులు ఉన్నారు. రోజుకు 350 మిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. చెల్లింపులే కాకుండా ఇన్సూరెన్స్, రుణాలు, సంపద, ఈ-కామర్స్, యాప్‌స్టోర్ వంటి విభాగాల్లో కూడా PhonePe తన సేవలను విస్తరించింది. ఫోన్‌పే బ్రోకింగ్ సర్వీసెస్ సీఈఓ విశాల్ గుప్తా మాట్లాడుతూ.. హోమ్ ఇన్సూరెన్స్ ను ఎక్కువ మంది వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం సంస్థ లక్ష్యం. ఈ హోమ్ ఇన్సూరెన్స్ ఆఫర్ ద్వారా ప్రతి కుటుంబం తమ అత్యంత విలువైన ఆస్తిని సులభంగా రక్షించుకోగలదు" అని అన్నారు.
ఎలా పొందాలంటే ?
PhonePe హోమ్ ఇన్సూరెన్స్‌ను పొందడం చాలా సులభం. వినియోగదారులు ముందుగా PhonePe యాప్‌ను ఓపెన్ చేసి, అందులోని ఇన్సూరెన్స్ విభాగంలో హోమ్ ఇన్సూరెన్స్ ఎంపిక చేయాలి. తరువాత ఇంటి విలువను నమోదు చేసి, కావలసిన బీమా వ్యవధిని ఎంచుకోవాలి. యజమాని, ఆస్తి వివరాలను నమోదు చేసిన తర్వాత చెల్లింపు పూర్తి చేస్తే, పాలసీ వెంటనే జారీ అవుతుంది. ఇలా సింపుల్ గా ఇన్సూరెన్స్ పొందవచ్చు.
బీమా పథకం ముఖ్యాంశాలు
- బీమా ప్రీమియం సంవత్సరానికి రూ. 181 నుండి ప్రారంభమవుతుంది.
- ఇది రూ. 10 లక్షల నుండి రూ. 12.5 కోట్ల వరకు కవర్‌ను అందిస్తుంది.
- ఈ బీమా కవరేజ్ గృహ రుణంతో, లేకుండా అందుబాటులో ఉంటుంది.
- దీని కింద, 20 కంటే ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం వలన కలిగే నష్టాలు కవర్ చేయబడతాయి.
- ఈ బీమాను యాప్ ద్వారా నిమిషాల్లో కొనుగోలు చేయవచ్చు.
- ఇందులో ఇంటితో పాటు టీవీ, ఫ్రిజ్, ఏసీ, సోఫా, బెడ్ మొదలైన వాటి కవరేజ్ కూడా ఇవ్వబడుతుంది.