MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Petrol Diesel Prices Today: మ‌రోసారి పెట్రో మంట‌.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధ‌ర‌ ఎంతో తెలుసా..?

Petrol Diesel Prices Today: మ‌రోసారి పెట్రో మంట‌.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధ‌ర‌ ఎంతో తెలుసా..?

దేశంలో చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. బుధవారం ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు ప్రతీ రోజూ దాదాపు 80, 90 పైసల వరకు పెంచుతూనే వస్తున్నాయి. డీజిల్‌ ధరలు కూడా పెట్రోల్‌తో సమానంగా వస్తున్నాయి. 16 రోజుల్లో చమురు ధరలు 14 సార్లు పెరిగాయి. పెట్రోల్, డీజీల్ పై దాదాపు రూ.10 మేర పెరిగాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 06 2022, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధ‌వారం (ఏప్రిల్ 6, 2022) పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై 80 పైసలు చొప్పున పెరిగాయి. వ‌రుస‌గా 16 రోజుల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గడం ఇది 14వ సారి. గత 16 రోజుల్లో లీటరు పెట్రోల్ పై ధర రూ.10 పెరిగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి బుధ‌వారం (ఏప్రిల్ 06, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా బుధ‌వారం ధ‌ర‌ల్లో మార్పు చోటుచేసుకున్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.
 

35

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.41 కాగా, డీజిల్‌ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 120.51 కాగా, డీజిల్‌ రూ. 104.77గా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.09 కాగా, డీజిల్ రూ. 100.18గా నమోదైంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.05 కాగా, డీజిల్‌ రూ. 94.81 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 115.08 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 99.82గా ఉంది.

45

ఇక‌పోతే తెలుగు రాష్ట్రాలైన.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 119.49 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 105.49గా ఉంది. విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 121.46కాగా, డీజిల్‌ రూ. 107.09కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినందున ధరలు మరింత ఎగుస్తాయని అంచనాలున్నాయి. దీంతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి, గ్రోత్‌పై ప్రభావం చూపనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత దేశం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అవసరాలపై ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది.
 

55

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.  మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved