ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.30 కంటే తక్కువ.. మన రేటుతో పోల్చితే నమ్మలేరు అసలు..
న్యూఢిల్లీ: పాకిస్థాన్ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధర లీటరు రూ.300 దాటింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ దేశంలోని ప్రస్తుత ప్రభుత్వం గురువారం లీటరు పెట్రోల్‌పై రూ.14.91, డీజిల్‌పై రూ.18.44 చొప్పున పెంచింది. ఈ పెంపు తర్వాత లీటర్ పెట్రోల్ ధర రూ.305.26కి, డీజిల్ ధర లీటరుకు రూ.311.84కి చేరింది.
ఇదిలావుండగా భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికీ చాల తక్కువగానే ఉన్నాయి. గతేడాది మే నుంచి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం భారతదేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద కొనసాగుతోంది.
గత కొంత కాలంలో పాకిస్థాన్ రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం భారత రూపాయి విలువ పాకిస్థానీ 3 రూపాయల 70 పైసలకి సమానం. ఈ కోణం నుండి చూస్తే పాకిస్తాన్ రూపాయితో పోల్చితే ఢిల్లీలో పెట్రోల్ ధర 358.07 ఉంటుంది. అయితే పాకిస్థాన్‌లో ఈ ధర లీటరుకు రూ.305.26. అదే విధంగా ఢిల్లీలో డీజిల్ ధర 331.78 పాకిస్థానీ రూపాయలుగా ఉంటుంది. కాగా, పాకిస్థాన్‌లో లీటరు డీజిల్ ధర 311.84 రూపాయలు. అంటే, మన దేశ రూపాయి ప్రకారం ఢిల్లీ పెట్రోల్ ధరతో పోలిస్తే పాకిస్తాన్‌లో పెట్రోలు చౌకగా 29. 31 పాకిస్తానీ రూపాయలు, డీజిల్ దాదాపు 23 పాకిస్తానీ రూపాయలుగా ఉంటుంది.
ముడి చమురు
మరోవైపు ముడిచమురు ధరలో మరోసారి భారీ పెరుగుదల కనిపిస్తోంది. దింతో ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం మార్కెట్ ముగింపులో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.98 శాతం లేదా $1.72 పెరిగి $88.55 వద్ద ముగిసింది. అదే సమయంలో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లేదా WTI క్రూడ్ కూడా బ్యారెల్‌కు 2.30 శాతం లేదా $ 1.92 పెరిగి బ్యారెల్‌కు $ 85.55కి చేరుకుంది. దాదాపు ఏడాదిన్నరగా ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు లేదు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చివరిసారిగా మార్చాయి. ఆ తర్వాత మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.