రూ.90 వేలకే 175 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్ బైక్ ఇది
చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్స్ కూడా తయారు చేస్తున్నాయి. అలాంటి ఓ కంపెనీ ఓబెన్. ఇటీవల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. అద్బుతమైన ఫీచర్స్ కలిగిన ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఇవిగో.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఓబెన్ ఎలక్ట్రిక్ అనేది ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్టార్ట్-అప్. 2020 ఆగస్ట్ నెలలో IIT & IIM పూర్వ విద్యార్థులు దీన్ని స్థాపించారు. బెంగళూరులో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను డిజైన్, అభివృద్ధి, తయారీ వంటి అన్ని విభాగాలను ఈ కంపెనీ సొంతంగా నిర్వహిస్తోంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు, బైక్స్ ని కూడా తయారు చేస్తోంది.
ఇటీవల ఓబెన్ కంపెనీ రోర్ EZ అనే సూపర్ బైక్ ని తయారు చేసి లాంచ్ చేసింది. LFP బ్యాటరీ టెక్నాలజీతో తయారైన ఈ బైక్ వేడిని తట్టుకునే విధంగా రూపొందించారు. ఇది వేడిని 50 శాతం నిరోధిస్తుంది. అందువల్ల బ్యాటరీ లైఫ్ రెట్టింపు అవుతుంది. ఈ బైక్ లో మూడు రకాల బ్యాటరీలు ఉన్నాయి. 2.6 kWh, 3.4 kWh, 4.4 kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీలతో మూడు వేరియంట్లలో ఈ బైక్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.
ఇందులో టాప్ వేరియంట్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 175 కి.మీ. వరకు పరుగులు తీస్తుంది. ఇది గంటకు 95 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. 0 నుండి 40 కి.మీ. వేగాన్ని కేవలం 3.3 సెకన్లలోనే అందుకుంటుంది. 45 నిమిషాల్లోనే 80 % ఛార్జింగ్ అవుతుంది.
ఇందులో క్లాసిక్ హెడ్‌ల్యాంప్, టెలిస్కోపిక్ ఫోర్కులు, మోనో-షాక్ సస్పెన్షన్ ఉండటం వల్ల చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఎలక్ట్రో ఆంబర్, సర్జ్ సియాన్, లూమినా గ్రీన్, ఫోటాన్ వైట్ అనే నాలుగు కలర్స్‌లో ఈ బైక్ లభిస్తుంది.
రోర్ EZలో Eco, City, Havoc అనే మూడు రకాల మోడ్స్ ఉన్నాయి. Eco మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచుతుంది. Havoc మోడ్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. LED డిస్‌ప్లే, జియోఫెన్సింగ్, UBA, DAS వంటి ఫీచర్లతో సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తూ ఈ బైక్ తయారు చేశారు.
రోర్ EZ ధర కేవలం రూ.89,999. మీరు నెలకు రూ.2,200 EMI కడితే సరిపోతుంది. 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ. వారంటీతో Oben Care ప్లాన్ ఉంది. అందువల్ల మీ బైక్ కు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా ఇబ్బంది ఉండదు. ఓబెన్ కంపెనీ దేశ వ్యాప్తంగా 60 కొత్త షోరూమ్‌లు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: అందమైన స్కూటర్లు అందుబాటు ధరలోనే.. గోదావరి మోటార్స్ 3 కొత్త ఈవీలు విడుదల