UPI: ఇప్పుడు మీరు గూగుల్ పే, ఫోన్ పేల నుంచి ఏకంగా పది లక్షలు ఒకేసారి పంపించేయొచ్చట
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి UPI ద్వారా చెల్లింపులు చేసే వారికి ఒక శుభవార్త. ఇకపై సెప్టెంబర్ 15, 2025 నుండి UPI లావాదేవీల పరిమితి పెరగబోతోంది. మీరు ఒక్కసారే పది లక్షల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

మీకొక శుభవార్త
UPI ద్వారా చెల్లింపులు చేసే వారు ఇప్పుడు పెరిగిపోయారు. వారందరికీ NPCI శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 15, 2025 నుండి కొత్త నియమాలు అమలులోకి తెస్తున్నట్టు వివరించింది. ఇన్సూరెన్స్, లోన్ EMI, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రభుత్వ రుసుములు, ట్రావెల్ బుకింగ్‌లకు వంటివాటికి చెల్లించేందుకు రూ.10 లక్షల వరకు ఒకేసారి చెల్లించే అవకాశాన్ని కల్పించింది. PhonePe, Google Pay, Paytm యాప్‌ల ద్వారా ఈ సదుపాయం అందుతుంది.
UPI లావాదేవీల పరిమితి
P2P లావాదేవీల పరిమితి ప్రస్తుతం రోజుకు కేవలం ఒక లక్ష రూపాయలగానే ఉంది. ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌లకు రూ.5 లక్షల వరకు పెరిగింది. క్రెడిట్ కార్డ్ బిల్లులకు ఒకేసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.6 లక్షలు వరకు చెల్లించే అవకాశాలను కల్పిస్తోంది. ట్రావెల్ బుకింగ్‌లకు ఒకేసారి రూ.5 లక్షలు చెల్లించవచ్చు.
ఈఎమ్ఐలు చెల్లించేందుకు వీలు
లోన్ చెల్లింపులు, EMI చెల్లింపులకు ఒకేసారి రూ.5 లక్షలు లేదా రోజుకు రూ.10 లక్షలు చెల్లించవచ్చు. నగల కొనుగోలుకు రూ.2 లక్షల వరకు, రోజుకు రూ.6 లక్షల వరకు చెల్లించవచ్చు.