Google Pay: గూగుల్ పేలో అనుకోకుండా తప్పు నెంబర్‌కి డబ్బు పంపారా? అప్పుడు ఏం చేయాలి?
గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా డిజిటల్ లావాదేవీలు అధికంగా సాగుతున్నాయి. ఒక్కోసారి అనుకోకుండా ఫోన్ నెంబర్ తప్పుగా టైప్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక నెంబర్ కు బదులు వేరే నెంబర్ కు డబ్బులు పంపించేస్తుంటారు. అప్పుడు ఆ డబ్బులు తిరిగి ఎలా పొందాలి?

Google Pay వాడకం
ఇప్పుడు ఇండియాలో డిజిటల్ చెల్లింపులు అధికమైపోయాయి. గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా సులభంగా డబ్బులు పంపే అవకాశం ఉండడంతో దీన్ని అందరూ వాడుతున్నారు. కానీ ఆ సమయంలో చేసే చిన్న తప్పు కూడా డబ్బు కోల్పోయేలా చేస్తుంది. తప్పుగా నెంబర్‌ని ఎంచుకున్నా లేదా టైపింగ్‌లో తప్పు జరిగితే డబ్బు వేరే వాళ్లకి వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో ఎంతో మంది కంగారు పడతారు.
అప్పుడు ఏం చేయాలి?
ఇలాంటి తప్పులు జరిగితే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ముందుగా తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు తప్పుగా వేరే వారికి వెంటనే ఆ వ్యక్తిని అడిగి డబ్బును తిరిగి పొందాలి. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లయితే, డబ్బు తిరిగి పొందడం సులభం. కానీ మీకు తెలియని వారికి డబ్బు వెళితే పరిస్థితి ఏమిటి?
తెలియని వ్యక్తికి డబ్బు పంపితే
తెలియని వ్యక్తికి డబ్బు పంపితే వారిని పరిస్థితిని వివరించండి. తప్పును వివరించి, డబ్బు తిరిగి ఇవ్వమని కోరవచ్చు. ఈ పద్ధతి పనిచేయకపోతే గూగుల్ పే కస్టమర్ కేర్‌ని సంప్రదించవచ్చు. 18004190157 నెంబర్‌లో వారిని సంప్రదించవచ్చు.
ఫిర్యాదు చేయడానికి ఏం కావాలి?
గూగుల్ పే కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేసే ముందు మీరు చేసిన లావాదేవీ ID, తేదీ, సమయం, ఎంత డబ్బు, ఎవరికి పంపారో వారి UPI ID వంటి వివరాలను ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఈ వివరాలను గూగుల్ పే కస్టమర్ కేర్‌కి అందించాలి.
NPCI ఫిర్యాదు
భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI)కి ఫిర్యాదు చేయడం మరో మార్గం. npci.org.in వెబ్‌సైట్‌లో 'What We Do' క్లిక్ చేసి UPIని ఎంచుకోవాలి. లావాదేవీ ID, బ్యాంక్ వివరాలు, మొత్తం వంటి వివరాలను నమోదు చేసి ఫిర్యాదు చేయవచ్చు.