- Home
- Business
- Nothing Phone 3a Series: సూపర్ న్యూస్.. నథింగ్ ఫోన్ 3ఎ సిరీస్ రిలీజ్ కి రెడీ. ఫీచర్స్ అదిరిపోయాయి
Nothing Phone 3a Series: సూపర్ న్యూస్.. నథింగ్ ఫోన్ 3ఎ సిరీస్ రిలీజ్ కి రెడీ. ఫీచర్స్ అదిరిపోయాయి
Nothing Phone 3a Series: త్వరలో ఇండియాలో విడుదల కానున్న నథింగ్ ఫోన్ 3a సిరీస్ ప్రో వెర్షన్ లుక్ ఎంత బాగుందో చూశారా? చూడటానికి చాలా స్టైల్ గా, మంచి డిజైన్ తో కనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి.

నథింగ్ ఫోన్ 3a సిరీస్ ఫోన్లను ఇండియాలో మార్చి 4న విడుదల చేయనున్నట్లు కంపెనీ తన X అకౌంట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో ప్రో వెర్షన్ మొదటి లుక్ అధికారికంగానే రిలీజ్ అయింది. ఇది ఫోన్ 2a, ఫోన్ 2a ప్లస్ మోడల్స్‌తో పోలిస్తే చాలా కొత్తగా కనిపిస్తోంది. దీనికంత ప్రత్యేకత ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
టీజర్‌ను చూస్తే ఇందులో రెండు కెమెరాలతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా కూడా కనిపిస్తోంది. అయితే నథింగ్ కంపెనీ స్టాండర్డ్ డివైజ్‌కు పెరిస్కోప్ కెమెరాను యాడ్ చేయాలని అనుకోవట్లేదని సమాచారం. అందువల్ల నార్మల్ నథింగ్ ఫోన్ 3a మోడల్ వేరే డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం ఇది మూడు బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెన్సార్లు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చి ఉంటాయి. ప్రో వెర్షన్ లో కెమెరా ప్లేస్‌మెంట్ వేరుగా ఉంది. సెన్సార్లు L ఆకారంలో ఉంటాయి.
నథింగ్ ఫోన్ 3a ప్రో.. 3x ఆప్టికల్, 6x ఇన్-సెన్సార్ జూమ్‌ను అందిస్తుందని తెలిసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. మీరు ఈ ఫీచర్ ద్వారా 60x హైబ్రిడ్ "అల్ట్రా" జూమ్ చేయొచ్చు. అదనంగా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కూడా ఉంటుందట. ఇది నథింగ్ ఫోన్ (2a) కంటే ఎక్కువ క్లారిటీ ని అందిస్తుంది.
పెరిస్కోప్ కెమెరా, ఇతర అప్‌గ్రేడ్స్ ఉండటం వల్ల నథింగ్ ఫోన్ 3a ప్రో.. ఫోన్ 2a ప్లస్ మోడల్ కంటే ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంది.
రిపోర్ట్స్ ప్రకారం నెక్స్ట్ నథింగ్ ఫోన్స్ రెండూ 5,000 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. నథింగ్ ఫోన్ 3a సిరీస్ వెనుక ప్యానెల్‌లో క్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. 6.72-ఇంచ్ 120Hz అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది.
ధరలు ఇలా ఉండొచ్చు..
రిపోర్ట్స్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 3a 8 GB RAM + 128 GB స్టోరేజ్ వెర్షన్ సుమారు రూ. 31,600 నుండి స్టార్ట్ అవుతుంది. నథింగ్ ఫోన్ 3a ప్రో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,400 ఉంటుంది. యూరోపియన్ మార్కెట్‌తో పోలిస్తే ఇండియాలో ధరలు కొంచెం తక్కువగా ఉండొచ్చు.