- Home
- Business
- Nissan Magnite: రూ. 6.14 లక్షలకే 5 స్టార్ SUV.. మళ్లీ ట్రెండింగ్‌లోకి నిస్సాన్ మ్యాగ్నైట్ !
Nissan Magnite: రూ. 6.14 లక్షలకే 5 స్టార్ SUV.. మళ్లీ ట్రెండింగ్‌లోకి నిస్సాన్ మ్యాగ్నైట్ !
Nissan Magnite: ఇండియన్ మార్కెట్‌లో నీసాన్ మ్యాగ్నైట్ ఒక విశిష్ట స్థానం సంపాదించుకుంది. ఇండియాలో తయారైన ఈ SUV బడ్జెట్ ఫ్రెండ్లీ ధరతో పాటు ఉత్తమైన సేఫ్టీ ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకున్న ఈ కారు గురించి ధర, ఫీచర్లు?

బడ్జెట్‌లో 5-స్టార్ సేఫ్టీ కారు
టాటా, మహీంద్రా లాంటి భారతీయ బ్రాండ్ల కార్లు ఇప్పటికే 5 స్టార్ సేఫ్టీతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో నిస్సాన్ కూడా అడుగుపెట్టింది. కేవలం ₹ 6.14 లక్షల ప్రారంభ ధరలో లభిస్తున్న నిస్సాన్ మ్యాగ్నైట్ SUV తాజాగా 5 స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్ సాధించి, బడ్జెట్ సెగ్మెంట్లో సేఫ్టీకి కొత్త నిర్వచనం.
65 దేశాలకు ఎగుమతి
నిస్సాన్ మ్యాగ్నైట్ చెన్నైలో తయారు అవుతున్న 65 దేశాలకు ఎగుమతి అవుతోంది. GNCAP సేఫ్టీ పరీక్షల్లో భద్రతకు 5 స్టార్ రేటింగ్ అందుకుంది.
సేఫ్టీకి కొత్త నిర్వచనం
2024 అక్టోబర్‌లో విడుదలైన నిస్సాన్ మ్యాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ భద్రత పరంగా గణనీయమైన మార్పులతో వచ్చింది. ఈ SUVలో 40కిపైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి, వీటిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (Anti-lock Braking System), EBD (Electronic Brakeforce Distribution), ESC (Electronic Stability Control) వంటి ఫీచర్లు వీటి సొంతం. ఈ ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి. క్రాష్ సమయంలో ప్రయాణికులను రక్షించడంలో ఎయిర్‌బ్యాగ్స్ కీలకపాత్ర పోషిస్తే, రోడ్ మీద కంట్రోల్ కోల్పోకుండా ఉండేందుకు ESC, ABS సహాయపడతాయి.
పలు కోణాల్లో విశ్లేషణ
గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో కార్ల భద్రతను పలు కోణాల్లో విశ్లేషిస్తారు. ESC (Electronic Stability Control) పని తీరును పరిశీలిస్తారు. అత్యధిక స్టార్ రేటింగ్ పొందే కార్లకు కేవలం ప్రయాణికుల రక్షణే కాదు, సైడ్-పోల్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ వంటి ఆడ్వాన్స్డ్ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి.
బడ్జెట్ సెగ్మెంట్‌లో హై ఎండ్ కారు
నిస్సాన్ మ్యాగ్నైట్ 5 స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ పొందిన నేపథ్యంలో నిస్సాన్ మోటార్ ఇండియా MD సౌరభ్ వత్స హర్షం వ్యక్తం చేశారు. "ఇది మా కస్టమర్లపై ఉన్న నమ్మకానికి, మా భద్రతా విధానాలపైన మా నిబద్ధతకు నిదర్శనం. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉన్న కారుకు ఈ స్థాయి రేటింగ్ రావడం గొప్ప గర్వకారణం" అని MD సౌరభ్ వత్స అన్నారు.
40కి పైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు
నిస్సాన్ మ్యాగ్నైట్ మోడల్ వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమేరా వంటి 40కి పైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.