RBI New Rule: ఏటీఎంలో డబ్బులు తీస్తున్నారా.. ఛార్జీల మోత మోగుతోంది
ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఇక నుంచి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. తాజాగా ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. మరి.. ఆ రూల్స్ ప్రకారం.. రోజుకి ఎన్నిసార్లకు మించి డబ్బులు డ్రా చేస్తే.. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందో తెలుసుకుందామా..

RBI New rules
మనలో చాలా మంది తమ సంపాదన మొత్తాన్ని బ్యాంకుల్లోనే దాచుకుంటూ ఉంటారు. ఆ దాచుకున్న డబ్బును ఏటీఎం నుంచి డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే... ఇక నుంచి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... కస్టమర్లకు RBI కొత్త నిబంధనలను ప్రకటించింది.
ఏటీంలలో డబ్బులు డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మనీ లిమిట్ దాటి డ్రా చేస్తే చాలా ఎక్కువ ఛార్జీలు చెల్లించాలి. బ్యాంకుల ఛార్జీలు కూడా వర్తిస్తాయి.

5 సార్లకు మించి డ్రా చేస్తే ఛార్జీలు
ఇప్పటివరకు ఒక రోజులో 5 సార్లు ఉచితంగా డబ్బు డ్రా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కువ డబ్బు డ్రా చేసుకుంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మీ సేవింగ్స్ అకౌంట్ నుండి డబ్బు డ్రా చేసుకుంటే బ్యాంకు ఛార్జీలు వసూలు చేస్తుంది. ఇలాంటి నిబంధనలు రాబోతున్నాయి.
లావాదేవీ ఛార్జీలు పెరుగుదల
గరిష్ట లావాదేవీ ఛార్జీ ₹21 నుండి ₹22 కి పెరుగుతుంది. ఇప్పటినుండి 5 సార్లు ఉచితంగా డబ్బు డ్రా చేసుకోవచ్చు. కానీ, ఆ తర్వాత డబ్బు డ్రా చేసుకుంటే ఈ కొత్త ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్ఛేంజ్ ఛార్జీల పెరుగుదల
ATM ఇంటర్ఛేంజ్ ఫీజు ₹17 నుండి ₹19 కి పెరిగింది. ఈ ఇంటర్ఛేంజ్ ఫీజు ఇతర బ్యాంకుల ATMలలో డబ్బు డ్రా చేసుకున్నప్పుడు వసూలు చేస్తారు.
లిమిట్ దాటితే ఛార్జీలు
ఉదాహరణకు మీ కార్డు PNB బ్యాంకుదై, మీరు వేరే బ్యాంకు ATMలో డబ్బు డ్రా చేసుకున్నా, ఈ లిమిట్ దాటితే ఈ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, ATM నిర్వహణ ఖర్చు కూడా క్రమంగా పెరుగుతోంది.