- Home
- Business
- Maruti cars: కొత్త జీఎస్టీ ధరలు వచ్చేసాయి.. మారుతి సుజుకి కార్లపై లక్ష రూపాయలకు పైగా తగ్గింపు
Maruti cars: కొత్త జీఎస్టీ ధరలు వచ్చేసాయి.. మారుతి సుజుకి కార్లపై లక్ష రూపాయలకు పైగా తగ్గింపు
మారుతి కార్ల (Maruti) ధరలు తగ్గిపోయాయి. కొత్త జీఎస్టీ పన్నును మారుతి సుజుకి అమల్లోకి తెచ్చింది. కొత్త పన్నుల ప్రకారం ఈ కారు రూ.3.69 లక్షల నుంచి ప్రారంభమైపోతుంది. జీఎస్టీ తగ్గింపు ప్రభావంతో సెప్టెంబర్ 22 నుంచి మారుతి కార్ల ధరలు తక్కువకే వస్తాయి.

జీఎస్టీ పన్నులు మారాయి
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నో వస్తువుల ధరలు తగ్గుతాయి. వాటిలో ముఖ్యమైనవి నిత్యావసర వస్తువులు. చాలా వస్తువులపై 28 శాతంగా ఉన్న జీఎస్టీ పన్నును 18 శాతం, 5 శాతానికి తగ్గించారు. ఈ పన్నులు సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల కార్ల ధరలు కూడా భారీగా తగ్గబోతున్నాయి. మారుతి సుజుకి సవరించిన ధరలను ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి మారుతి సుజుకి కార్ల ప్రారంభ ధర కేవలం 3.69 లక్షల రూపాయలు మాత్రమే. మారుతి సుజుకి కంపెనీకి చెందిన అన్ని కార్ల ధరలు తగ్గుతున్నాయి.
లక్ష రూపాయల తగ్గింపు
మారుతి ఆల్టో ధర లక్ష రూపాయల వరకు తగ్గించింది. గ్రాండ్ విటారాతో సహా ఇతర మారుతి కార్ల ధరలు కూడా అదే విధంగా లక్ష రూపాయల వరకు తగ్గాయి. మారుతి సుజుకి దాదాపు అన్ని కార్ల ధరలలో సుమారు లక్ష రూపాయలకు పైగా తగ్గించింది.
జీఎస్టీ తగ్గింపు తర్వాత మారుతి సుజుకి కార్ల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)
మారుతి సుజుకి ఆల్టో : 3,69,900 రూపాయలు (1,07,600 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ : 4,98,900 రూపాయలు (79,600 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి ఇగ్నిస్ : 5,35,100 రూపాయలు (71,300 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి స్విఫ్ట్ : 5,78,900 రూపాయలు (84,600 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి బాలెనో: 5,98,900 రూపాయలు (86,100 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి డిజైర్: 6,25,600 రూపాయలు (87,700 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ : 6,84,900 రూపాయలు (1,12,600 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి బ్రెజ్జా : 8,25,900 రూపాయలు (1,12,700 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి హై-ఎండ్ కార్ల సవరించిన ధరల జాబితా
మారుతి సుజుకి గ్రాండ్ విటారా : 10,76,500 రూపాయలు (1,07,000 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి జిమ్నీ : 12,31,500 రూపాయలు (51,900 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి ఎర్టిగా : 8,80,000 రూపాయలు (46,400 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి XL6: 11,52,300 రూపాయలు (52,000 రూపాయల తగ్గింపు)
మారుతి సుజుకి ఇన్విక్టో: 24,97,400 రూపాయలు (61,700 రూపాయల తగ్గింపు)
ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు
ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీ కేవలం 5 శాతం మాత్రమే పడుతుంది. ఇక 4 మీటర్ల పొడవు, 1,200 సిసి పెట్రోల్ ఇంజిన్, 1500 సిసి డీజిల్ ఇంజిన్ కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇక లగ్జరీ కార్లు, 1,500 సిసి కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న కార్లపై జీఎస్టీ 40 శాతంగా ఉంది.