mutual fund investment రెండేళ్లకే మీ డబ్బులు డబుల్.. ఇవే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్!
స్టాక్ మార్కెట్ పై కనీస అవగాహన లేకున్నా పెట్టుబడులపై మంచి రాబడి దక్కించుకోవాలంటే ఏకైక మార్గం మ్యూచువల్ ఫండ్స్. నెలనెలా సిప్ చేస్తుంటే దీర్ఘకాలంలో మంచి రిటర్నులు సంపాదించుకోవచ్చు అన్నది నిపుణుల మాట. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయిన నేపథ్యంలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయం. ఏకంగా 40% పైగా రిటర్న్ ఇస్తున్న కొన్ని మ్యూచువల్ ఫండ్స్ (Mutual Fund Investment) గురించి తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్
ఇన్వెస్ట్ చేయడానికి షేర్ మార్కెట్ ఉంది. కానీ స్టాక్స్ పై అవగాహన లేని చాలామంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Fund Investment Calculator) ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Fund News) ఇన్వెస్ట్ చేయడం మంచిదని నిపుణులు కూడా అంటున్నారు. అందుకే వీటికి డిమాండ్ పెరుగుతోంది.
ప్రస్తుతం చాలా రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫండ్స్ ఏకంగా 40% రిటర్న్స్ ఇస్తున్నాయి. అలాంటి మూడు ఫండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం (Mutual Fund Investment Plans).
మొదట నిప్పన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ గురించి చూద్దాం (Nippon India Multi Cap Fund). ఇది మల్టీక్యాప్ ఈక్విటీ ఫండ్. దీని ఏడాది రిటర్న్ 39.4% (జనవరి 2024 వరకు). మూడేళ్ల రిటర్న్ 31.37% (జనవరి 2024 వరకు). ఈ ఫండ్‌లో రిస్క్ చాలా ఎక్కువ. నిప్పన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ బాగా రాణిస్తోంది. ఇది ఇన్వెస్టర్లకు మంచి ఆప్షన్.
మోతిలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ విషయానికి వస్తే (Motilal Oswal Mid Cap Fund)ఇది మిడ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్. ఏడాది రిటర్న్ 58.95%, మూడేళ్ల రిటర్న్ 34.51%, ఐదేళ్ల రిటర్న్ 33.48%. ఈ ఫండ్‌లో రిస్క్ కాస్త ఎక్కువ. ఎందుకంటే ఇది మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల రిటర్న్స్ కూడా ఎక్కువే ఉంటాయి. ఎక్కువ రిస్క్ తీసుకునేవాళ్లకు ఇది మంచి ఆప్షన్.
చివరిగా క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ (Quant Small Cap Fund). ఈ ఫండ్ గత ఐదేళ్లలో మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఏడాదికి 38.22% రిటర్న్ ఇచ్చింది. డైరెక్ట్ ప్లాన్ ఏడాదికి 39.96% రిటర్న్ ఇచ్చింది. కాబట్టి ఇది ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్.
Disclaimer: మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌తో కూడుకున్నది. ఇన్వెస్ట్ చేసేముందు నిపుణుల సలహా తీసుకోవాలి.