- Home
- Business
- Relaince: రిలయన్స్ లో మరో నాయకత్వ బదిలీ, ఈసారి ఈశా అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం...
Relaince: రిలయన్స్ లో మరో నాయకత్వ బదిలీ, ఈసారి ఈశా అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం...
ముఖేష్ అంబానీ తన గ్రూప్ టెలికాం విభాగం, రిలయన్స్ జియో బోర్డు డైరక్టర్ పదవి నుంచి రాజీనామా చేసి, పెద్ద కుమారుడు ఆకాష్‌కు కంపెనీ పగ్గాలను అప్పగించారు. ప్రస్తుతం తన కుమార్తె ఈశా అంబానీకి కూడా కీలక బాధ్యతలు అప్పగించే దిశగా ముఖేష్ అంబానీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రిలయన్స్ జియో చైర్మన్ గా ఆకాష్ ను నియమించగా, ఈశా అంబానీకి కూడా రిలయన్స్ రిటైల్ బాధ్యతలు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు.

Akash ambani
ఆసియాలోని అత్యంత సంపన్న కార్పోరేట్ కుటుంబాలలో ఒకటైన అంబానీ కుటుంబం, తమ రిలయన్స్ గ్రూపులో నాయకత్వ బదిలీని వేగవంతం చేసింది. గతంలో ధీరూభాయి అంబానీ ఆస్తుల విభజన చేయకుండానే, పరమపదించారు. దీంతో వారసులైన ముకేష్, అనిల్ అంబానీల మధ్య వివాదం నెలకొన్నది, అయితే ఆ తప్పును తాను చేయకూడదని నిర్ణయించుకున్న ముకేష్ అంబానీ, ఇప్పుడు రిలయన్స్ బాధ్యతలను తన వారసులైన ఆకాష్, ఈశా, అనంత్ అంబానీలకు కంపెనీ బాధ్యతలను అప్పగిస్తున్నారు.
అయితే వారసత్వానికి ఆస్తుల బదిలీ కోసం ముందస్తు ప్రణాళికతో ముకేష్ అంబానీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇషా అంబానీ రిలయన్స్ గ్రూపు రిటైల్ యూనిట్‌కు ఛైర్మన్‌గా ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది.
ఇషా అంబానీ ఎలివేషన్‌కు సంబంధించిన ప్రకటన త్వరలోనే రావచ్చు, ఈ విషయం తెలిసిన వ్యక్తుల ప్రకారం, అధికారిక ప్రకటన కంటే ముందుగా గుర్తించవద్దని కోరారు. ప్రస్తుతం ఆమె రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, టెలికాం యూనిట్ ఛైర్మన్‌గా మంగళవారం నియమితులైన ఆమె కవల సోదరుడు ఆకాష్ అంబానీ ప్రమోషన్, అటు ఇషా అంబానీ ప్రమోషన్ కు కొనసాగింపు అవుతుందని పేర్కొన్నారు. ఇషా, ఆకాష్ ఇద్దరూ మెటా ప్లాట్‌ఫారమ్‌ల పెట్టుబడిపై చర్చలు జరిపిన టీమ్‌లలో భాగంగా ఉన్నారు.
30 ఏళ్ల ఇషా యేల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఈ కవలలకు అనంత్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో కుటుంబానికి చెందిన ఆయిల్-టు-టెలికాం గ్రూపు అనుబంధ సంస్థలకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రధాన సంస్థ. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.