మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?
Minimum Balance: భారతదేశంలోని ప్రధాన బ్యాంకులలో మినిమం బ్యాలెన్స్ నిబంధన ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు, తమ బ్రాంచ్ ఉన్న ప్రాంతం (మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ), ఖాతా రకం ఆధారంగా మినిమమ్ బ్యాలెన్స్ రూల్ వేర్వేరుగా ఉంటుంది.

మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే?
Minimum Balance: భారతదేశంలోని ప్రధాన బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ రూల్ అనేది అత్యంత కీలకం. ఇది ఖాతాదారులు నెలవారీగా కనీసంగా అకౌంట్‌లో ఉంచాల్సిన మొత్తం. బ్యాంకులు ఈ మొత్తం బ్యాలెన్స్ సగటున నిలుపకపోతే, ఖాతాదారుల అకౌంట్ నుండి నేరుగా పెనాల్టీలు వసూలు చేస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో అత్యధిక మినిమం బ్యాలెన్స్ విధిస్తుండగా, ఇతర ప్రధాన బ్యాంకుల్లో ఈ రూల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC BANK)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మినిమం బ్యాలెన్స్ నిబంధన బ్రాంచ్ ఉండే ప్రాంతాన్నిబట్టి విభజించబడ్డాయి. అర్బన్ లేదా మెట్రో బ్రాంచీలలో ఖాతాదారులు సగటున కనీసం రూ. 10,000 బ్యాలెన్స్ ఉంచాలి. అదనంగా, ఏడాది వ్యవధితో కనీసం రూ. 1,00,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి.
ఇక సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ సగటు మినిమం బ్యాలెన్స్ రూ. 5,000 ఉండాలి, లేదా కనీసం రూ. 50,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులు అకౌంట్లో కనీసం రూ. 2,500 ఉంచాలి లేదా రూ. 25,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉండాలి. ఈ నియమాలు పాటించకపోతే బ్యాంక్ ఖాతాదారులకు పెనాల్టీ విధించవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోయినా ఫర్వాలేదు. ఖాతాదారుల సౌలభ్యం కోసం జీరో బ్యాలెన్స్ రిక్వైర్‌మెంట్ విధించబడింది. అంటే, ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదా పెనాల్టీలు ఉండవు.
ఐసీఐసీఐ (ICICI)
ICICI బ్యాంక్‌లో మినిమమ్ బ్యాలెన్స్ బ్యాంచ్ ఉండే ప్రాంతాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. మెట్రో, అర్బన్ బ్రాంచ్‌లలో ₹15,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ₹7,500, గ్రామీణ ప్రాంతాల్లో ₹2,500. ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే.. మొత్తం లోటులో 6% లేదా ₹500 (ఏది తక్కువ అనిపిస్తే) పెనాల్టీ విధించబడుతుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra)
మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ రకాన్ని బట్టి మినిమమ్ బ్యాలెన్స్ నిర్ణయించబడుతుంది. సగటున రూ. 10,000 నుంచి రూ. 20,000 మధ్య ఉండాలి. ఖాతాదారులు ఈ మినిమమ్ బ్యాలెన్స్‌లో లోటు ఉంటే, బ్యాంక్ షార్ట్‌ఫాల్ అమౌంట్‌పై 6% పెనాల్టీ విధిస్తుంది. ఈ విధానం ఖాతాదారులు తమ ఖాతాల్లో బ్యాలెన్స్ సక్రమంగా ఉండేలా ప్రేరేపించబడుతుంది.
ఇండియన్ బ్యాంక్ (Indian Bank)
ఇండియన్ బ్యాంక్‌లో ఖాతా రకాన్ని ఆధారంగా మినిమమ్ బ్యాలెన్స్ నిర్ణయించబడుతుంది. మెట్రో, అర్బన్ బ్రాంచ్‌లలో చెక్ సౌకర్యం ఉన్న ఖాతాలకు సగటున ₹2,500, చెక్ సౌకర్యం లేని ఖాతాలకు ₹1,000 బ్యాలెన్స్ కొనసాగించాల్సి ఉంటుంది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో చెక్ సౌకర్యం ఉన్న ఖాతాలకు ₹1,000, చెక్ లేని ఖాతాలకు ₹500 బ్యాలెన్స్ అవసరం.
బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ బరోడా విషయానికి వస్తే.. మినిమమ్ బ్యాలెన్స్ ప్రాంతాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. మెట్రో, అర్బన్ ఏరియాల్లో ₹2,000,సెమీ అర్బన్ ప్రాంతాల్లో ₹1,000, గ్రామీణ ప్రాంతాల్లో ₹500గా ఉంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మెట్రో బ్రాంచ్‌లకు ₹10,000, అర్బన్‌కి ₹5,000, సెమీ అర్బన్‌కి ₹2,000, గ్రామీణ ప్రాంతాల్లో ₹1,000 బ్యాలెన్స్ ఉండాలని నిర్ణయించబడింది.
యాక్సిస్ బ్యాంక్ (Axis bank)
యాక్సిస్ బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన ప్రత్యేకంగా ఉంది. ఖాతాదారులు అన్ని రకాల బ్రాంచ్‌లలో (మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ) నెలవారీగా సగటున కనీసం రూ. 10,000 బ్యాలెన్స్‌ను అకౌంట్లో ఉంచాల్సి ఉంటుంది. లేకపోతే, ఖాతాదారులు పెనాల్టీ చెల్లించాల్సిందే. లేదా ఖాతాదారులు ఒక ఏడాది వ్యవధితో రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఉంచితే, మినిమమ్ బ్యాలెన్స్ రూల్‌ను పాటించాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వ బ్యాంకులలో
ప్రభుత్వ బ్యాంకులలో ఎస్బీఐ (SBI), కెనరా బ్యాంక్ (Canara Bank) వంటి బ్యాంకులు సాధారణ సేవింగ్స్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా లేదా తక్కువగా నిర్ధారించాయి. బాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda), పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( Punjab National Bank), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Union Bank of India), ఐడీబీఐ ( IDBI)బ్యాంక్‌లు ఖాతా రకానికి, బ్రాంచ్ ను బట్టి ₹250 నుంచి ₹2,000 వరకు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే.. ప్రైవేట్ బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు పాటించకపోతే.. భారీ మొత్తంలో పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది.