- Home
- Business
- Maruti Suzuki: కారు ప్రియులకు గుడ్ న్యూస్: మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు! ఎక్స్ఛేంజ్ చేసినా సూపర్ కారు కొనుక్కోవచ్చు
Maruti Suzuki: కారు ప్రియులకు గుడ్ న్యూస్: మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు! ఎక్స్ఛేంజ్ చేసినా సూపర్ కారు కొనుక్కోవచ్చు
Maruti Suzuki: జూన్ 2025లో కార్ కొనాలనుకొనే వారికి శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి వివిధ కార్లపై రూ.30,000 వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఏఏ కార్లపై ఎంతెంత ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందామా?

మారుతి సుజుకి డిస్కౌంట్లు
ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ డల్ గా ఉంది. ఈ నేపథ్యంలో అమ్మకాలు పెంచుకునేందుకు మారుతి సుజుకి జూన్ 2025లో డిస్కౌంట్లు ప్రకటించింది. హ్యాచ్‌బ్యాక్‌ల నుండి MPVలు, SUVల వరకు అన్ని కార్లపైనా డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు ప్రకటించింది.
SIAM నివేదిక ప్రకారం గత నెలలో కార్ల అమ్మకాలు తగ్గాయి. అందుకే కొనుగోలుదారులను ఆకర్షించడానికి మారుతి సుజుకితో పాటు అనేక కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటించాయి. మారుతి సుజుకి కంపెనీ కార్ల డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఆల్టో K10, సెలెరియో
ఆల్టో K10, సెలెరియో కార్ల మాన్యువల్ వెర్షన్లపై రూ.35,000 వరకు డిస్కౌంట్ ఉంది. AMT వెర్షన్లపై రూ.40,000 వరకు డిస్కౌంట్ ఉంది. కార్పొరేట్ కొనుగోలుదారులకు రూ.2,100 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఎస్-ప్రెస్సో డిస్కౌంట్లు
ఎస్-ప్రెస్సో మాన్యువల్ వెర్షన్ రూ.30,000 తగ్గింపుతో లభిస్తుంది. ఇందులోనే AMT వెర్షన్‌పై రూ.35,000 డిస్కౌంట్ ఉంది. దీనికి కార్పొరేట్ బోనస్ రూ.2,100 కూడా వర్తిస్తుంది.
వేగన్ ఆర్‌పై భారీ డిస్కౌంట్
వేగన్ఆర్ మాన్యువల్ కార్లపై రూ.35,000 వరకు డిస్కౌంట్ ఉండగా, ఇందులోనే AMT కార్లపై రూ.40,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీ దగ్గర పాత వేగన్ఆర్ ఉంటే, దాన్ని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.40,000 బోనస్ లభిస్తుంది. దీనికి రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇలా మొత్తం మీద రూ.85,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
స్విఫ్ట్ కారుపై బోనస్
స్విఫ్ట్ కారుపై రూ.25,000 డిస్కౌంట్ ఉంది. అదే మీ పాత స్విఫ్ట్ కారు ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.50,000 బోనస్ లభిస్తుంది. దీనికి రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈకోపై డిస్కౌంట్లు ఎలా ఉన్నాయంటే..
ఈకో పెట్రోల్ వెర్షన్‌పై రూ.15,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈకో CNG వెర్షన్‌పై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది.
బ్రెజ్జా, ఎర్టిగా ఆఫర్లు
బ్రెజ్జా పెట్రోల్‌పై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుండగా, దీంతో పాటు రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్ కూడా పొందొచ్చు.
ఇక ఎర్టిగా విషయానికొస్తే ఎర్టిగా MPVపై రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే ఉంది.
అదనపు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ఆఫర్లు
మీ దగ్గర ఉన్న పాత కారు ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.15,000 బోనస్ లభిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న కారు 15 ఏళ్లు దాటినదైతే ఆ కారు స్క్రాప్ చేయించి కొత్త కారు కొంటే రూ.25,000 బోనస్ లభిస్తుంది.
కొత్త కారు కొనుగోలుదారులకు ఆఫర్లు
3 ఏళ్లలోపు కారు ఉన్నవారు కొత్త వేగన్ఆర్ లేదా స్విఫ్ట్ కొంటే అదనపు ఆఫర్లు కూడా పొందవచ్చు.
గమనిక: ఈ ఆఫర్లు జూన్ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని సమాచారం. కంపెనీ అధికారికంగా పేర్కొన్న ప్రకారం వివిధ వేరియంట్లపై డిస్కౌంట్‌లు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల మీ సమీపంలోని డీలర్‌ను సంప్రదించి తాజా ఆఫర్లను తెలుసుకొని కొనుగోలు చేయడం మంచిది.