సూపర్ మైలేజ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ... కేవలం రూ. 17 వేలకే మీ చేతికి!
ఎం2గో ఎక్స్1 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 120 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన ఈ స్కూటర్ ధర ఎంతో తెలుసా?
ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల
మీరు తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? మంచి మైలేజ్ తో పాటు అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి విడుదలైంది. దాని వివరాలు, ధర ఎంతో తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎం2గో (M2GO) ఎక్స్1 (X1) ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ ఈవి స్కూటర్ ధర భారతీయ మార్కెట్లో రూ 95,000 గా వుంది. ఇతర కంపనీల ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఈ ధర తక్కువే. మీరు పూర్తి మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు...కొంత మొత్తాన్ని చెల్లించి ఈ స్కూటర్ ను పొందవచ్చు.
కేవలం రూ 17,000 డౌన్ పేమెంట్ చేసి మిగిలిన మొత్తానికి మీరు లోన్ తీసుకోవచ్చు. 36 నెలల వ్యవధిలో ఈఎంఐల రూపంలో లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు. ఇలా ఎలక్ట్రిక్ వాహనాన్ని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే చిన్న చిన్న వాయిదాలలో చెల్లించడం ద్వారా కొనుగోలును మరింత సులభతరం చేస్తుంది.
ఈ ఎం2గో ఎక్స్1 మంచి సౌకర్యాన్ని అందించే విధంగా రూపొందించబడిన వివిధ ఫీచర్లతో వస్తుంది. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
M2GO X1 ఎలక్ట్రిక్ స్కూటర్
ఇది రైడర్‌లు తమ వేగం, దూరాన్ని సులభంగా ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అదనంగా స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, ఎల్‌ఈడీ టర్న్ సిగ్నల్ లైట్లు కలిగివున్నాయి. ఇక ఇందులో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ వుంది... ప్రయాణంలో ఉన్నప్పుడే తమ ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
భద్రతా చర్యల్లో భాగంగా సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటివి ఉన్నాయి. ఇందులోని ట్యూబ్‌లెస్ టైర్లు మంచి మన్నికను కలిగివుంటాయి. అలాగే గతుకుల రోడ్లలోనూ మంచి రైండింగ్ అనుభవాన్ని ఇస్తాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్‌లు
ఎం2గో ఎక్స్1 ఎలక్ట్రిక్ స్కూటర్ శక్తివంతమైన బ్యాటరీతో పనిచేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు విరామం లేకుండా ప్రయాణించవచ్చు. ఇది రోజువారీ ప్రయాణాలకు చాలా అనువైనది. తరచుగా రీఛార్జ్ చేయాలనే చింత లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 3 నుండి 4 గంటలు పడుతుంది. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది తక్కువ సమయమే. స్పీడ్ విషయానికి వస్తే ఎం2గో ఎక్స్1 గరిష్టంగా గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది నగరాలు, పట్టణ ప్రయాణాలకు మంచి ఎంపిక.
రూ.17,000 డౌన్ పేమెంట్, సులభమైన నెలవారీ ఈఎంఐలతో కూడిన ఫైనాన్సింగ్ ప్లాన్‌తో, పర్యావరణ అనుకూల రవాణాకు మారాలనుకునే ఎవరికైనా ఎం2గో ఎక్స్1 కొనుగోలు చేయవచ్చు... మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.