MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Loan: సిబిల్ స్కోర్ ఒక్క‌టే కాదు.. ఇవి కూడా లోన్ రిజ‌క్ట్ కావ‌డానికి కార‌ణాలు

Loan: సిబిల్ స్కోర్ ఒక్క‌టే కాదు.. ఇవి కూడా లోన్ రిజ‌క్ట్ కావ‌డానికి కార‌ణాలు

Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్లు ఎక్కువగా సిబిల్ స్కోర్ (CIBIL Score) మీదే దృష్టి పెడతారు. కానీ లోన్ ఆమోదం పొందాలంటే కేవలం స్కోర్ మాత్రమే కాదు, ఇతర ఆర్థిక అంశాలు కూడా చాలా కీలకం. ఇంత‌కీ ఆ అంశాలు ఏంటంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 14 2025, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్థిరమైన నెలవారీ ఆదాయం ఉండాలి
Image Credit : stockPhoto

స్థిరమైన నెలవారీ ఆదాయం ఉండాలి

బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు మీరు ప్రతి నెల ఎంత సంపాదిస్తున్నారో పరిశీలిస్తాయి. మీకు స్థిరమైన జీతం (Fixed Monthly Income) ఉంటే బ్యాంక్‌కి నమ్మకం కలుగుతుంది. మీరు సమయానికి EMIలు చెల్లించగలరని బ్యాంకులు భావిస్తాయి. కానీ మీ ఆదాయం స్థిరంగా లేకపోతే లేదా ప్రతి నెల మారుతూ ఉంటే, బ్యాంక్ మీకు లోన్ ఇవ్వడానికి సంకోచిస్తుంది. వ్యాపారులైతే తమ ఆదాయం నిరూపించే డాక్యుమెంట్లు ఇవ్వాలి. మీరు పెద్ద కంపెనీలో ఉద్యోగి అయితే, లోన్ ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

25
వయస్సు కూడా ప్రభావం చూపుతుంది
Image Credit : Getty

వయస్సు కూడా ప్రభావం చూపుతుంది

బ్యాంకులు లోన్ ఆమోదించే సమయంలో అప్లికెంట్ వయస్సును కూడా పరిగణలోకి తీసుకుంటాయి. యువకులు అయితే, వారి వద్ద ఆదాయం సంపాదించే సమయం ఎక్కువగా ఉందని భావిస్తారు. అందువల్ల వారికి లోన్ సుల‌భంగా ఇస్తాయి. కానీ వయస్సు ఎక్కువగా ఉన్నవారికి, లేదా వృద్ధులకు, బ్యాంకులు లోన్ ఇవ్వడంలో జాగ్రత్తగా ఉంటాయి. వయస్సు పెరిగేకొద్దీ ఆదాయం తగ్గే అవకాశం ఉండ‌డ‌మే దీనికి కార‌ణం.

Related Articles

Related image1
Andhra pradesh: ఏపీలో మ‌రో హైటెక్ సిటీ.. దెబ్బ‌కు ఈ ప్రాంత ప్ర‌జ‌ల రాత మార‌నుంది.
Related image2
Motivational Story: జీవితంలో ఓపిక ఎందుకు ముఖ్యం.. ఈ క‌థ‌ చ‌దివితే మీకే అర్థ‌మ‌వుతుంది
35
క్రెడిట్ హిస్టరీ (CIBIL Score) ఒక్కటే కాదు
Image Credit : PR

క్రెడిట్ హిస్టరీ (CIBIL Score) ఒక్కటే కాదు

సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నా, మీరు ఇతర ఆర్థిక ప్రమాణాలకు సరిపోకపోతే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ 750కి పైగా ఉంటే మంచిదే, కానీ అది ఒక్కటే నిర్ణయం కాదు. బ్యాంక్‌కి మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నారా, అప్పులు ఎంతవరకు తీర్చుతున్నారు అనే వివరాలు కూడా ముఖ్యం. కాబ‌ట్టి గ‌తంలో తీసుకున్న అప్పులు, వాటిని మీరు చెల్లించిన తీరును కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాయి కొన్ని బ్యాంకులు.

45
ఇప్పటికే ఉన్న అప్పులు
Image Credit : PR

ఇప్పటికే ఉన్న అప్పులు

మీరు ఇప్పటికే మరిన్ని లోన్లు తీసుకొని వాటి EMIలు చెల్లిస్తున్నట్లయితే, బ్యాంక్‌కి అనుమానం వస్తుంది. మీ ఆదాయం మొత్తం అప్పులు తీర్చడానికే వెళ్తే, కొత్త లోన్ మంజూరు చేయడంలో బ్యాంక్ వెనకడుగు వేస్తుంది. అందువల్ల కొత్త లోన్ తీసుకోవాలంటే ముందుగా పాత అప్పులను తగ్గించడం లేదా క్లియర్ చేయడం మంచిది.

55
పర్సనల్ లోన్ సులభంగా పొందడానికి సూచనలు
Image Credit : Getty

పర్సనల్ లోన్ సులభంగా పొందడానికి సూచనలు

* మీ సిబిల్ స్కోర్ 750 పైగా ఉండేలా చూసుకోండి.

* జీతం, ఆదాయ పత్రాలు ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంచండి.

* పాత లోన్లను సమయానికి చెల్లించండి.

* ఒకేసారి ఎక్కువ లోన్లకు అప్లై చేయకండి.

* మీ ఆదాయం, ఖర్చుల మధ్య సరైన బ్యాలెన్స్ ఉంచండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Related Stories
Recommended image1
Andhra pradesh: ఏపీలో మ‌రో హైటెక్ సిటీ.. దెబ్బ‌కు ఈ ప్రాంత ప్ర‌జ‌ల రాత మార‌నుంది.
Recommended image2
Motivational Story: జీవితంలో ఓపిక ఎందుకు ముఖ్యం.. ఈ క‌థ‌ చ‌దివితే మీకే అర్థ‌మ‌వుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved