Pension: LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్.. ఒక్క ప్రీమియంతో జీవితాంతం పెన్షన్!
ప్రస్తుతం ఆర్థిక ప్రణాళికపై అందరికీ అవగాహన పెరుగుతోంది. మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి లోటు లేకుండా హాయిగా ఉండేందుకు ముందునుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సరిగ్గా అలాంటివారి కోసమే LIC స్మార్ట్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఒక్క ప్రీమియంతో జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తోంది!

ఎవరైనా సరే రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా తక్కువ ఖర్చులో ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఇప్పుడు LIC స్మార్ట్ పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చింది. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో మీ భవిష్యత్తును మీకు నచ్చినట్లుగా గడపవచ్చు.
స్కీమ్ వివరాలు
18 నుంచి 65 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ పెన్షన్ ప్లాన్ కొనుగోలు చేయొచ్చు. ఇందులో సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ కవరేజ్ కూడా ఉంది. LIC స్మార్ట్ పెన్షన్ స్కీమ్ లో నెలకు రూ. 1,000 , 3 నెలలకు రూ. 3 వేలు, 6 నెలలకు రూ. 6 వేలు, సంవత్సరానికి రూ. 12 వేల చొప్పున యాన్యుటీలు ఉంటాయి. యాన్యుటీ ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఒకటి ఎంచుకుంటే దాన్ని మళ్లీ మార్చలేము.
కంపెనీ పాలసీ
LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్ కింద కనీస కొనుగోలు ధర రూ. లక్ష. గరిష్ఠ కొనుగోలుకు పరిమితి లేదు. అయితే, గరిష్ట కొనుగోలు విలువ కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ పాలసీలో 3 నెలలు దాటాక లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
లైఫ్ లాంగ్ పెన్షన్
మనం ఎంచుకున్న పీరియడ్ ప్రకారం పెన్షన్ వస్తుంది. ఏటా 3 నుంచి 6 శాతం పెన్షన్ పెరుగుతుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ ఎంపిక చేసుకోవడమే ఇక్కడ ముఖ్యమైన విషయం. జాయింట్ లైఫ్ పెన్షన్ ఎంపిక చేసుకుంటే జీవితాంతం భార్యాభర్తల ఇద్దరికి పెన్షన్ వస్తుంది. హ్యపీగా గడిపేయవచ్చు.
ఆన్ లైన్ లో
ఈ పాలసీని ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. స్కీమ్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్, ఎల్ఐసీ ఏజెంట్లను సంప్రదించాల్సి ఉంటుంది.