సిబిల్ స్కోర్ 500కు పడిపోయినా బ్యాంకు నుంచి ఈజీగా లోన్ ఎలా పొందాలో తెలుసుకుందాం...
మీరు బ్యాంకు కి వెళ్ళినప్పుడు రుణం కోసం అప్లై చేసుకున్నప్పుడు సిబిల్ స్కోర్ ఎంత ఉందా అని చెక్ చేయడం సహజమే. కానీ మీరు ఉద్యోగులు కానప్పుడు లేదా సరైన ఆదాయం లేనప్పుడు మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు కింద పేర్కొన్నటువంటి కొన్ని పద్ధతుల్లో మీరు రుణం కి అప్లై చేసుకుంటే బ్యాంకు నుంచి సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణం పొందే అవకాశం ఉంది.
క్రెడిట్ స్కోర్ అనేది మీరు రుణాన్ని పొందేందుకు అర్హత ఉందా లేదా అని తెలియజెప్పే ఒక ప్రమాణం. దీన్ని పలు క్రెడిట్ ఏజెన్సీలు అందిస్తాయి. మన దేశంలో సిబిల్ సంస్థ ఈ స్కోరును అందజేస్తుంది. ముఖ్యంగా నెల వేతనం పొందే వ్యక్తులకు సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమైనది. దీని ద్వారానే వారికి రుణాలను అందజేస్తారు. ముఖ్యంగా హోమ్ లోన్, కార్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ ఇలా అన్ని రకాల రుణాలకు క్రెడిట్ స్కోర్ అనేది తప్పనిసరి తీసుకోరును 400 పాయింట్ల నుంచి 900 పాయింట్ల వరకు ఇస్తారు.
అయితే 750 పాయింట్లు మంచి క్రెడిట్ స్కోర్ గా నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా సకాలంలో ఈ అమ్మాయిలు చెల్లించడం అలాగే క్రెడిట్ కార్డు బిల్లులను క్లియర్ చేయడం వంటి పనుల ద్వారా మీరు సిబిల్ స్కోర్ ను మెయింటైన్ చేయవచ్చు. అయితే సిబిల్ స్కోర్ లేకపోతే ఇక బ్యాంకు నుంచి రుణం పొందలేమా అనే సందేహం మీకు కలగవచ్చు. కానీ సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా బ్యాంకులో రుణాలను అందిస్తాయి. అలాంటి రుణాల్లో ముందు వరుసలో నిలిచేది గోల్డ్ లోను అనే చెప్పాలి.
గోల్డ్ లోన్ : ప్రస్తుతం గోల్డ్ లోన్ అనేది చాలా డిమాండ్ ఉన్నటువంటి రుణం. ఇప్పటికే ఈ రంగంలో ప్రభుత్వ బ్యాంకులతో ప్రారంభిస్తే ప్రైవేటు బ్యాంకులో అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం ఈ రంగంలో వేగంగా దూసుకెళ్తున్నాయి ముఖ్యంగా గోల్డ్ లోన్ జారీ చేసేందుకు ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు కేవలం మీ బంగారాన్ని తనకా పెట్టి మీకు కావాల్సిన డబ్బులు తీసుకు వెళ్ళవచ్చు అయితే బంగారం లోను మీరు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకు ఆ బంగారాన్ని జప్తు చేసుకునే ప్రమాదం ఉంది. కావున బంగారాన్ని విడిపించుకునేందుకు సకాలంలో రుణాన్ని చెల్లించాలి అని గుర్తించుకోండి.
ఇల్లు తనకా పెట్టి రుణం పొందడం
మీకు ఇల్లు, లేదా భూమి ఉన్నట్లయితే, వాటిని తనఖా పెట్టడం ద్వారా కూడా రుణం పొందే వీలుంది. ఇందుకు ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు. కేవలం బ్యాంకు మీ ఆస్తి పత్రాలను దగ్గర పెట్టుకొని రుణం అందిస్తుంది. అయితే ఈ రుణాన్ని కూడా మీరు సకాలంలోనే తీర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఆస్తిని బ్యాంకు వారు జట్టు చేసుకొని వేలం పాటలో అమ్మివేసే అవకాశం ఉంది.
ఫిక్స్డ్ డిపాజిట్ లపై రుణం పొందడం
ఒకవేళ మీకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లయితే ఆ బ్యాంకు వాడు మీకు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు తనకా పెట్టి లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ తో పనిలేదు. అలాగే బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు వెనుకాడవు.
ఎల్ఐసి పాలసీలపై రుణం
ఎల్ఐసి పాలసీలను కూడా తనకా పెట్టడం ద్వారా బ్యాంకు నుంచి రుణపడి ఉంది అయితే ఆయా బ్యాంకులో నిబంధనలకు అనుగుణంగా ఎల్ఐసి పాలసీలను హామీగా తీసుకొని రుణాన్ని మీకు కేటాయిస్తాయి దీనికి కూడా సిబిల్ స్కోర్ తో సంబంధం లేదు.