నిజమే, ఈ చెట్లకు డబ్బులు కాస్తాయి.. బెస్ట్ బిజినెస్ ఐడియా
ఉద్యోగం చేసే వారిలో చాలా మంది ఏదో ఒక మంచి వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తితో ఉంటారు. ఇందుకోసం ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి కలలు కంటుంటారు. అయితే సరైన అవగాహన లేక వ్యాపారంలో నష్టపోతుంటారు. మరి ఎప్పటికీ డిమాండ్ ఉండే ఒక మంచి వ్యాపారం గురించి ఈరోజు తెలుసుకుందాం..

Business Idea
ప్రస్తుతం యువత ఆలోచన మారుతోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేసే రొటీన్ వర్క్ తమతో కాదనుకుంటున్నారు. వినూత్నంగా ఆలోచించి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే చాలా మంది వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడి పెట్టాలని, నష్టాలు వస్తే ఎలా అనే ఆలోచనలో ఉంటారు. అయితే అలా కాకుండా తక్కువ పెట్టుబడితో ఎప్పటికీ డిమాండ్ ఉండే కొన్ని వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో నిమ్మ చెట్ల పెంపకం ఒకటి.
కాలం మారుతోంది. ఒకప్పుడు వ్యవసాయం అంటే చదువుకోని వారు చేసే పని అనే అపోహ ఉండేది. కానీ ప్రస్తుతం లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాలను వదిలేసి వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఇలాంటి వాటిలో నిమ్మ మొక్కల సాగు ఒకటి. కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ డిమాండ్ ఉండే నిమ్మకాయలను సాగు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ నిమ్మసాగుకు ఎంత పెట్టుబడి కావాలి.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మసాగు చేపట్టాలంటే మీకు కొంత స్థలం ఉండాలి. అద్దెకరంలో కూడా నిమ్మసాగు చేపట్టవచ్చు. ఈ మొక్కల పెంపకానికి నీరు కూడా తక్కువగానే అవసరపడుతుంది. అద్దెకరం భూమిలో సుమారు 50 చెట్లను పెంచుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన నిమ్మ మొక్క ధర సుమారు రూ. 30గా ఉంది. నిమ్మ మొక్కలను నాటిన కనీసం మూడేళ్ల తర్వాత పంట చేతికి వస్తుంది.
అయితే మీరు కొనుగోలు చేసిన మొక్క నాణ్యతపై దిగుబడి ఆధారపడి ఉంటుంది. మూడేళ్ల తర్వాత నిరంతరం దిగుబడి వస్తూనే ఉంటుంది. నిమ్మ చెట్ల నుంచి ఏడాదికి సుమారు మూడుసార్లు కోతకు వస్తుంది. ఒక్క చెట్టుకు ఏడాదికి సుమారు 500 కిలోల నిమ్మకాయ దిగుబడి వస్తుంది. ఉదాహారణకు ఒక 50 మొక్కలతో సాగు ప్రారంభిస్తే రూ. 15వేల వరకు మొక్కలకు అవుతుంది. పంటను రక్షించేందుకు సహజసిద్ధమైన రసాయనాలను ఉపయోగించవచ్చు. వేసవి సమయంలో ఒక్కో నిమ్మకాయ ఏకంగా రూ. 5 పలికే సందర్భాలు కూడా ఉంటాయి.