Business Ideas: మహిళలకు గుడ్ న్యూస్ ఈ బిజినెస్ చేస్తే మీరు ఇల్లు కదలకుండా రూ. 50 వేలు సంపాదించే అవకాశం..
మహిళలు ఇంటి వద్ద ఉండే వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉండే కాలు కదపకుండా ప్రతినెల 50 వేలకు తగ్గకుండా ఆదాయం సంపాదించిన అవకాశం ఉంది ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడే మనం తెలుసుకుందాం.
మహిళలు ముఖ్యంగా వ్యాపారం చేయాలంటే కావలసింది పెట్టుబడి ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత సులభమైన పద్ధతుల్లో ముద్రా రుణాలను అందిస్తోంది మీరు బ్యాంకుకు వెళ్లి ముద్రా రుణాలను ఈజీగా పొందే అవకాశం ఉంది. బ్యాంకుల్లో మీరు ఎలాంటి తనకా లేకుండా 50వేల రూపాయల నుంచి పది లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఈ రుణాలను మీరు అతి తక్కువ వడ్డీరేట్లకే పొందే అవకాశం ఉంది. అంతేకాదు మీరు సులభ వాయిదాలలో వీటిని చెల్లించవచ్చు.
ఇక మహిళలు ఇంటి వద్ద ఉండి చేయగలిగే వ్యాపారాల్లో ప్రధానమైనది. పట్టు చీరల వ్యాపారం. సాధారణంగా పట్టు చీరలను పెద్దపెద్ద షాపుల్లో విక్రయిస్తారు వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది మధ్యతరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేయలేరు. పెళ్లిళ్లలో కట్టే పట్టుచీరలు ధర దాదాపు పదివేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు పలుకుతోంది ఈ నేపథ్యంలో ఖరీదైన పట్టు చీరలను మీరు సులభ వాయిదాల రూపంలో విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
అయితే పట్టు చీరలకు మాత్రమే మీరు ఈ స్కీం రన్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు ఇందుకోసం మీరు ఇంటి వద్ద . ఈ బిజినెస్ ప్రారంభిస్తే మంచిది. . ముఖ్యంగా మహిళలు ఇంటి వద్ద ఉంటూనే ఈ బిజినెస్ సులభంగా చేయవచ్చు. సాధారణంగా మధ్యతరగతి ప్రజలు పట్టుచీరలపై పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టలేరు కావున వారి వద్ద ఖరీదైన పట్టు చీరలను మూడు లేక ఐదు సులభ వాయిదాలలో చెల్లించేలా విక్రయిస్తే మంచిది. అత్యధికంగా సులభ వాయిదాలను పెట్టిన వర్కౌట్ కాకపోవచ్చు.
అయితే ఈ పద్ధతిలో ఈ బిజినెస్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముందుగానే మీరు కొన్ని నిబంధనలను పెట్టుకోవడం ద్వారా ఈ బిజినెస్ లో రాణించవచ్చు మీకు తెలిసిన సర్కిల్స్లో మాత్రమే ఈ బిజినెస్ చేసుకోవడం ద్వారా పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. లేకపోతే పెద్ద ఎత్తున నష్టం వచ్చే ప్రమాదం ఉంది.
మీ బిజినెస్ పెరిగే కొద్దీ, ఆర్డర్లు కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు పెద్ద మొత్తంలో షాపు ఏర్పాటు చేసుకొని బిజినెస్ చేయవచ్చు. సాధారణంగా చిన్న పట్టణాల్లోనూ అలాగే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ బిజినెస్ లో కొంత రిస్కు కూడా ఉంది. సులభ వాయిదాలను చెల్లించే విషయంలో కొద్ది మంది మొండికేసే అవకాశం ఉంది కావున వీటన్నిటిని బేరీజు వేసుకొని మీరు ఈ బిజినెస్ లోకి దిగితే మంచిది.