MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Credit Card: అప్పుల పడకుండా ఉండాలంటే.. క్రెడిట్​ కార్డులను ఇలా వాడండి..

Credit Card: అప్పుల పడకుండా ఉండాలంటే.. క్రెడిట్​ కార్డులను ఇలా వాడండి..

Credit Card: ప్రతి అవసరానికి క్రెడిట్ కార్డ్స్ వాడుతూ, బిల్లులను చెల్లించలేక చాలా మంది అప్పుల ఊబిలో పడుతున్నారు. ఈ బిల్లులను తిరిగి చెల్లించలేకపోవడంతో క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 చిట్కాలు పాటించండి.

2 Min read
Author : Rajesh K
Published : Aug 04 2025, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారతీయుల క్రెడిట్ కార్డ్ బకాయిలు ఎన్నికోట్లు?
Image Credit : Getty

భారతీయుల క్రెడిట్ కార్డ్ బకాయిలు ఎన్నికోట్లు?

Credit card: ఈ మధ్యకాలంలో చాలా మంది షాపింగ్, బిల్లు చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే, ఈ అలవాటు ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారుతోంది. CRIFహైమార్క్ నివేదిక ప్రకారం 2024 మార్చిలో రూ. 23,475 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డ్ బకాయిలు ఒక్క ఏడాదిలో రూ. 10,410 కోట్లు పెరిగి రూ. 33,866 కోట్లకు చేరుకున్నాయి. వీటిలో అధికంగా 91 నుంచి 180 రోజులుగా చెల్లించని బిల్లులే. వీటినే బ్యాడ్ లోన్ (NPA) పరిగణించబడతాయి. 

ఇలా చిన్న చిన్న అవసరాలకు క్రెడిట్ కార్డులు వాడుతూ, బిల్లులను చెల్లించలేక అప్పుల ఊబిలో పడుతున్నారు. చెల్లింపుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, అది భవిష్యత్‌లో ఆర్థిక భారం, క్రెడిట్ స్కోర్ నష్టానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 చిట్కాలు పాటించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. సకాలంలో బిల్లులు చెల్లింపు
Image Credit : Getty

1. సకాలంలో బిల్లులు చెల్లింపు

క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం తప్పనిసరి. పర్సనల్ లోన్ EMI చెల్లింపు లేదా క్రెడిట్ కార్డ్ బిల్ సకాలంలో చెల్లించకపోతే అధిక వడ్డీ ఛార్జీలు విధించబడతాయి. అలాగే.. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, పెండింగ్ బిల్లులను ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించి, మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్‌ను మెరుగుపరచవచ్చు.

36
2. పరిమితంగా వినియోగించండి
Image Credit : Getty

2. పరిమితంగా వినియోగించండి

మీ క్రెడిట్ కార్డ్ పరిమితి ఎంత ఉన్నా, దానిలో 30 శాతం కంటే ఎక్కువ వినియోగించకుండా జాగ్రత్త పడండి. దీని అర్థం కార్డును పరిమితంగా ఉపయోగించండి. ఉదాహరణకు, మీరు రూ. 1,00,000 క్రెడిట్ లిమిట్ ఉంటే.. అందులో రూ. 30,000 లోపు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. ఇది మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడటానికి దోహదపడుతుంది.

46
3. ఖర్చులపై పర్యవేక్షణ
Image Credit : Getty

3. ఖర్చులపై పర్యవేక్షణ

మీరు మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులను ప్రతిరోజూ పర్యవేక్షించండి. ఎంత ఖర్చవుతోంది, ఎక్కడ ఖర్చవుతోంది అనే వివరాలు స్పష్టంగా తెలుసుకోండి. అలాగే ఖర్చులపై కూడా ఓ పరిమితిని నిర్ణయించుకోండి. తద్వారా మీరు అధిక వడ్డీ భారం లేదా రుణ భారం రెండూ తగ్గుతాయి.

56
4. నిబంధనలపై అవగాహన
Image Credit : Getty

4. నిబంధనలపై అవగాహన

క్రెడిట్ కార్డ్ నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రధాన వసూలు చేసే ఛార్జీలు, వడ్డీ రేట్లు, లేటీ ఫీజులు, బిల్లింగ్ మొదలైన విషయాలను అర్థం చేసుకోవాలి. ఏదైనా సందేహం ఉంటే.. తక్షణమే మీ బ్యాంక్ లేదా కార్డ్ జారీ సంస్థను సంప్రదించండి. ఇది అనవసర ఖర్చులను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. అలాగే వారు అందించే సూచనలు ఉపయోగపడుతాయి.

66
5. సామర్థ్యాన్ని బట్టి ఖర్చు
Image Credit : our own

5. సామర్థ్యాన్ని బట్టి ఖర్చు

క్రెడిట్ కార్డుపై లిమిట్ వరకు ఖర్చు చేయవచ్చు. కానీ, మీరు తిరిగి చెల్లించే సామర్థ్యం మన దగ్గర ఉందా? లేదా? అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి.ప్రతి బిల్లింగ్ సైకిల్‌లో మొత్తం బ్యాలెన్స్‌ను చెల్లించడం వలన, వడ్డీ ఖర్చులు లేకుండా మీ క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. ఇది ఒక మంచి ఫైనాన్షియల్ అలవాటు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image2
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Recommended image3
Amazon: ఆఫర్స్ ఉన్నా లేకున్నా అమెజాన్‌లో చీప్‌గా దొరికే 5 వస్తువులు ఇవే!
Related Stories
Recommended image1
Credit card: ఈ క్రెడిట్ కార్డు లిమిట్ అక్ష‌రాల రూ. 10 కోట్లు.. ఏడాది ఛార్జీలే రూ. 2.75 లక్షలు
Recommended image2
Credit Card: క్రెడిట్ కార్డుతో డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved