- Home
- Business
- IRCTC Kashi Tour: కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ ఐఆర్‌సీటీసీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ.. ఎన్ని రోజులు, ఎంత చెల్లించాలి?
IRCTC Kashi Tour: కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ ఐఆర్‌సీటీసీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ.. ఎన్ని రోజులు, ఎంత చెల్లించాలి?
ఐఆర్‌సీటీసీ కాశీ యాత్ర (IRCTC Kashi Tour)ను ప్రవేశపెట్టింది. కోయంబత్తూరు నుండి ఈ కాశీ యాత్రం మొదలవుతుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర విమానంలో సాగుతుంది. దీనికి ఎంత ఖర్చవుతుంది, ఎన్ని రోజులు పడుతుందో తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ కాశీ టూర్ ప్యాకేజీ
విమానంలో అన్ని వసతులతో ఐఆర్‌సీటీసీ కాశీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఉత్తర భారతదేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శించాలనుకుంటే ఈ టూర్ ప్యాకేజీ అద్భుతమైనదని చెప్పాలి. ఈ యాత్ర నవంబర్ 18న కోయంబత్తూరులో మొదలవుతుంది. నవంబర్ 23 వరకు కొనసాగుతుంది. ఈ యాత్ర మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు పాటూ సాగుతుంది. విమాన టిక్కెట్లు, వసతి, గైడ్ సేవలు అన్నీ ఈ ప్యాకేజీలో భాగమే.
కాశీ
ఈ యాత్రలో ప్రధానమైనది వారణాసి. కాశీలోని కాశీ విశ్వనాథ ఆలయం తప్పక చూడాల్సిన ప్రదేశం. సాయంత్రం గంగా హారతిలో కూడా కచ్చితంగా పాల్గొనాలి. ఉదయాన్నే గంగానదిలో పడవ ప్రయాణం చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పురాతన వీధుల్లో నడుస్తూ ఆ అనుభూతే వేరు. కాశీ వెళ్లిన వారు కచ్చితంగా ఈ పనులన్నీ చేయాలి.
ప్రయాగ్‌రాజ్
ఈ యాత్రలో ప్రయాగ్‌రాజ్ ను కూడా సందర్శించవచ్చు. ఇందులో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమాన్ని చూడవచ్చు. ఈ ప్రాంతంంలో పవిత్ర స్నానం చేస్తే ఎంతో మంచిదని చెబుతారు. ఈ నగరం చరిత్ర, పురాతన ఆలయాలు, కళాత్మక ప్రదేశాలను కచ్చితంగా కన్నులారా చూడాల్సిందే.
అయోధ్య
అయోధ్యను జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి హిందువు కోరుకుంటారు. ఇక్కడ ఉన్న రామాలయం చరిత్రతో ముడిపడి ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. రామాయణ గాథను గుర్తుకు తెచ్చే ఆలయాలు, ప్రదేశాలు ఈ యాత్రలో ముఖ్యమైనవి. అలాగే బుద్ధగయను కూడా ఈ యాత్రలో చూడవచ్చు.
ఎంత ఖర్చు అవుతుంది?
మీరు ఈ యాత్రకు వెళ్లాలనుకుంటే అధికారిక ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ.39,750 నుండి మొదలవుతుంది. మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ అధికారిక సైట్‌ను చూడండి.